ఫిబ్రవరి 17న అగ్ని వలయ సూర్యగ్రహణం.. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూసే అవకాశం

Updated on: Feb 12, 2026 | 6:47 PM

ఫిబ్రవరి 17న అరుదైన 'రింగ్ ఆఫ్ ఫైర్' సూర్యగ్రహణం ఖగోళ ప్రియులను అలరించనుంది. వలయాకారంలో కనిపించే ఈ అద్భుత దృశ్యాన్ని "జ్వాలా వలయం" అని కూడా అంటారు. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పకుండా మధ్యలో చీకటి వృత్తాన్ని సృష్టిస్తాడు. భారతదేశంలో కనిపించకపోయినా, ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ అద్భుత ఖగోళ ఘటనను వీక్షించవచ్చు.

ఫిబ్రవరి 17న ఆకాశంలో అరుదైన దృశ్యం కనువిందు చేయనుంది. అదే ‘రింగ్ ఆఫ్ ఫైర్’ సూర్యగ్రహణం. వలయాకారంలో సూర్యుడి దర్శనాన్ని అందించే ఈ సూర్యగ్రహణం ప్రత్యేక ఖగోళ విశిష్టతను సంతరించుకుంది. ఇది మధ్యలో చీకటిగా, చుట్టూ మండుతున్నట్లుగా కనువిందైన అగ్ని వలయ దృశ్యాలను సృష్టిస్తుంది. ఈ వలయాన్ని “రింగ్ ఆఫ్ ఫైర్” లేదా “జ్వాలా వలయం” లేదా పెనంబ్రల్ సూర్యగ్రహణంగా పిలుస్తారు. ఇటువంటి ఖగోళ ఘటనలు అరుదుగా సంభవిస్తాయని, ఈ అద్భుత దృశ్యాన్ని చూసే అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు! సాధారణంగా సూర్యుడు, భూమి కక్ష్యలోకి చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆ సమయంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా లేదా పాక్షికంగా కప్పేస్తాడు. అప్పుడు సూర్యుడు కనిపించకపోవడం వల్ల భూమిపై సూర్య కాంతి తగ్గిపోతుంది. అయితే ఈసారి అది భూమికి చాలా దూరాన ఉంటుందని నాసా చెబుతోంది. ఈ కారణంగా చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పేయలేడు కానీ మండుతున్న సూర్యుడి అగ్ని గోళం కేంద్ర భాగం కనిపించకుండా చంద్రుని చిన్న చీకటి వృత్తం కమ్మేసిన దృశ్యాలు మనకు కన్పిస్తాయి. సంపూర్ణ సూర్యగ్రహణం కంటే భిన్నంగా ఉంటుంది పెనంబ్రల్ సూర్యగ్రహణం. సంపూర్ణ గ్రహణంలో, చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పేస్తాడు. ఆ సమయంలో మన భూమిపై నుంచి సూర్యుడు పూర్తిగా కనిపించకుండా కనుమరుగవుతాడు. సూర్యకాంతి భూమిపై పడకపోవడంతో పగలు కూడా చీకటిగా అనిపిస్తుంది. పెనంబ్రల్‌ గ్రహణం అంటార్కిటికా నుంచి “జ్వాలా వలయం” రూపంలో కనిపిస్తుంది. దక్షిణాఫ్రికా, టాంజానియా, జాంబియా, జింబాబ్వే దేశాలతో పాటు దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, చిలీలోని కొన్ని ప్రాంతాల నుంచి పాక్షికంగా కనిపిస్తుంది. అయితే గ్రహణ మార్గం దక్షిణార్ధగోళంలో ఉండటంతో భారతదేశంలో ఇది కనిపించదు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నవారైనా ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ గ్రహణాన్ని చూడొచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

5 ఏళ్ల తర్వాత అమ్మాయి.. గ్రామంలో సంబరాలు..

భూమ్మీద ఇదే చివరి రోడ్డు.. ఎక్కడ ఉందొ తెలుసా ??

డ్రైన్‌లో పడిపోయిన ఎద్దులు.. ట్రాఫిక్‌ పోలీసులు ఏం చేశారో తెలుసా

ఆ ఇద్దరు బ్యూటీస్ టైమ్ మొదలైంది.. హిట్ కొడితే దిమ్మ తిరగాల్సిందే

టాలీవుడ్ ను ఏలుతున్న తెలుగు బ్యూటీస్..

Loading...
Unable to load recommendations.
Follow Us