న్యూ ఇయర్‌ గిఫ్ట్‌గా.. అల్వాల్‌ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్

Updated on: Nov 18, 2026 | 6:36 PM

హైదరాబాద్‌లోని అల్వాల్ ప్రాంతంలో నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రి జనవరిలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. సుమారు రూ.1,200 కోట్లతో 28 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 1,000 పడకలు, 21 మేజర్ ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేశారు. న్యూరో సైన్స్, జెనెటిక్ సైన్స్ విభాగాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే పరిసర జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.

మెరుగైన వైద్యం కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇప్పటికే సనత్ నగర్ టిమ్స్‌తో ప్రజలకు భరోసా కల్పించిన సర్కారు, ఇప్పుడు నూతన సంవత్సర కానుకగా అల్వాల్ టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ అత్యాధునిక మెడికల్ హబ్ జనవరిలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ శివారు ప్రాంత ప్రజలకు అత్యున్నత వైద్య సేవలు అందించే ఉద్దేశంతో అల్వాల్‌లో ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. దాదాపు 28 ఎకరాల సువిశాల ప్రాంగణంలో, రూ. 1,200 కోట్ల భారీ బడ్జెట్‌తో దీన్ని నిర్మించారు. ఏకకాలంలో వేలాది మందికి వైద్యం అందించేలా 1,000 పడకల సామర్థ్యంతో ఈ ఆసుపత్రిని తీర్చిదిద్దారు. అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలను సైతం సులువుగా నిర్వహించేందుకు వీలుగా 21 మేజర్, 7 మైనర్ ఆపరేషన్ థియేటర్లను ఆధునిక వసతులతో ఏర్పాటు చేశారు. ముఖ్యంగా న్యూరో సైన్స్, జెనెటిక్ సైన్స్ విభాగాల్లో ఈ ఆసుపత్రిని ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా నిలబెట్టేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. జనవరిలో ఈ ఆసుపత్రి ప్రారంభమైతే మేడ్చల్ జిల్లా వాసులతో పాటు కరీంనగర్, సిద్దిపేట తదితర జిల్లాల నుంచి వచ్చే రోగులకు వైద్యం కోసం ఎదురుచూసే కష్టాలు తొలగిపోతాయి. అంతేకాకుండా, రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రులైన గాంధీ, ఉస్మానియాలపై పడుతున్న రోగుల రద్దీ భారం కూడా భారీగా తగ్గనుంది. పేద ప్రజలకు ప్రాణాపాయ స్థితిలోనూ మెరుగైన వైద్యం ఉచితంగా లేదా నామమాత్రపు ఖర్చుతో అందనుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయ్యప్పభక్తులకు తీపి కబురు.. మీ ఇంటికే నేరుగా ప్రసాదం

400 మార్కులకు 397తో భారీ స్కోర్‌.. టాపర్ బండారం బయటపడింది ఇలా!

పులినే పరుగులు పెట్టించిన మంత్రి… ఆ తర్వాత!

కార్తీకమాసంలో.. భక్తులకు శుభవార్త.. శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు

ఎవర్రా మీరు… సింహాన్నే హడలెత్తించారుగా

Loading...
Unable to load recommendations.
Follow Us