మెగా హీరో కోసం అతిధిగా వస్తోన్న కన్నడ స్టార్ హీరో ? ఆ సినిమాలో కీలక పాత్రలో నటించనున్న..

మెగా హీరో వరుణ్ తేజ్, కిరణ్ కొర్రపాటి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా 'గని'. గతంలో విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‏కు మంచి రెస్పాన్స్

మెగా హీరో కోసం అతిధిగా వస్తోన్న కన్నడ స్టార్ హీరో ? ఆ సినిమాలో కీలక పాత్రలో నటించనున్న..
Follow us

|

Updated on: Jan 30, 2021 | 2:12 PM

మెగా హీరో వరుణ్ తేజ్, కిరణ్ కొర్రపాటి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘గని’. గతంలో విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవలే ఈ మూవీ రిలీజ్ డేట్‏ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది.

వరుణ్ నటిస్తున్న ‘గని’ చిత్రంలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర అతిధి పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఇక ఫిబ్రవరి 12న ఉపేంద్ర ఈ సినిమా షూటింగ్‏లో పాల్గొననున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఉపేంద్ర ఓ కీలక పాత్రలో నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఆ పాత్రలో నటించడానికి ఉపేంద్ర సంతోషంగా అంగీకరించినట్లుగా సమాచారం. ఇక ఈ మూవీని సిద్దు మరియు అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గని సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా ఇందులో సాయి మంజ్రేకర్ హీరోయిన్‏గా నటిస్తున్నారు. బాక్సింగ్ స్పోర్ట్స్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కనుంది. ఇక ఈ మూవీ జూలై 30న థియేటర్లలోకి రానుంది.

Also Read:

Bigg Boss: ‘అతడితో ప్రేమలో ఉన్నాను’.. లవ్ మ్యాటర్‏ను బయటపెట్టిన బిగ్‏బాస్ కంటెస్టెంట్..