Viral Video: వామ్మో ఇదేం యోగా తల్లీ.. ఏమైనా తేడా వచ్చిందో.. అంతే సంగతి!

|

Sep 01, 2024 | 1:00 PM

యోగా పేరుతో ఇలాంటి ప్రమాదకర పనులు చేయొద్దని చెబుతున్నారు. ఇది ప్రజల్ని మోసం చేయడమేనని అంటున్నారు. పాములతో సహా ఏదైనా ఇతర జంతువులతో ఈ విధంగా ప్రవర్తించడం చట్ట ప్రకారం నేరం. ఇది నకిలీ యోగా. ఇలాంటి నకిలీ యోగా కేంద్రాలను, యోగా టీచర్లను శిక్షించాలంటూ మరికొందరు నెటిజన్లు డిమాండ్ చేశారు.

Viral Video: వామ్మో ఇదేం యోగా తల్లీ.. ఏమైనా తేడా వచ్చిందో.. అంతే సంగతి!
Woman Does Yoga With Snakes
Follow us on

అంతర్జాతీయ యోగా దినోత్సవం నుంచి యోగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. చాలా మంది ప్రజలు ఇప్పుడు తమ శరీరక, మానసిక ఆరోగ్యం కోసం యోగా అభ్యాసం చేస్తున్నారు. రోజులో ఏదో ఒక సమయం చూసుకుని తప్పనిసరిగా యోగా చేయటం అలవాటుగా మార్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు యోగాసానాల్లో కూడా చిత్రవిచిత్రాలు చేస్తున్నారు. రీల్స్ పిచ్చిలో కూడా కొందరు వినూత్న యోగాసాలను కనిపెడుతున్నారు. అలాంటిదే ఇక్కడ కూడా ఓ అమ్మాయి కొత్త భంగిమను కనిపెట్టింది. దీని పేరు స్నేక్ యోగాసనం. యోగా ఆసనాలలో భుజంగాసనం శరీరాన్ని ఎక్కువ లేదా తక్కువ మోతాదులో పాములా వంచేలా చేస్తుంది. వైరల్‌ వీడియోలో ఒక యువతి పాము యోగాసనం పేరుతో నిజమైన పామును శరీరం, మెడ చుట్టూరా చుట్టేసుకుని,తను ధీమాగా పద్మాసనంలో కూర్చోవడమే ఈ కొత్త ఆసనం.

కంటెంట్ సృష్టికర్త జేన్ జోంగ్ అనే యువతి ఈ యోగా ఆసనం గురించి వివరించింది. జేన్ యోగా కేంద్రానికి వెళ్లినప్పుడు, ఆమెకు ఈ కొత్త యోగాసనాన్ని నేర్పించారని చెప్పింది. అసలు పాముతోనే ఈ ఆసనం వేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎలాంటి ఆసనం అయినా సరే పాములతోనే నేర్పిస్తారట. గంట పాటు సాగే సెషన్‌లో ఒక్కొక్కరికీ ఒక పాము ఇస్తారు. పాముతో యోగా చేయడాన్ని మీ రొటీన్‌లో భాగం చేసుకోవాలి. అదంతా వినగానే మొదట తాను షాకయ్యానని చెప్పింది.. కానీ వెంటనే స్లాట్ బుక్ చేసుకున్నాక, అక్కడికి వెళ్లగానే యోగా గురువు మనకో పామును ఇస్తారు. పామును ఎలా పట్టుకోవాలనే విషయంలో స్నేక్ హాండ్లర్ కూడా కొన్ని సూచనలు చేస్తారు. ఇవన్నీ విషం లేని బాల్ పైథాన్‌ పాములేనని ఆమె చెప్పుకొచ్చింది. అయితే, తొలుత తాను చాలా భయపడ్డానని, కానీ, ఆ తరువాత యోగాపై దృష్టి పెట్టగలిగానని చెప్పింది. ఆ తరువాత మెల్లగా అలవాటు పడిపోయాను. ఈ పాములు కూడా బరువు తక్కువగా, చాలా స్మూత్‌గా ఉంటాయని చెప్పింది.

ఈ వీడియోను జేన్ పోస్ట్ చేశారు. కాగా, సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటికే 9 లక్షలకు పైగా ప్రజలు ఈ వీడియోని వీక్షించారు. జేన్ సాహసోపేతమైన యోగాను పలువురు నెటిజన్లు మెచ్చుకున్నారు. ఈ వీడియోపై చాలా మంది భారతీయులు కూడా కామెంట్స్ చేస్తున్నారు.యోగాలో ఇలాంటివి ఉండవని, యోగా పేరుతో ఇలాంటి ప్రమాదకర పనులు చేయొద్దని చెబుతున్నారు. ఇది ప్రజల్ని మోసం చేయడమేనని అంటున్నారు. పాములతో సహా ఏదైనా ఇతర జంతువులతో ఈ విధంగా ప్రవర్తించడం చట్ట ప్రకారం నేరం. ఇది నకిలీ యోగా. ఇలాంటి నకిలీ యోగా కేంద్రాలను, యోగా టీచర్లను శిక్షించాలంటూ మరికొందరు నెటిజన్లు డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి