మందు బిళ్ల అనుకుని ఎయిర్‌పాడ్ మింగేసింది.. ఆ తర్వాత కడుపులోంచి వచ్చిన సౌండ్స్ చూసి అంతా షాక్!

మనలో చాలా మంది రాత్రి వేళల్లో బెడ్‌పై పడుకుని ఫోన్ చూస్తూనో లేదా వేరే ఆలోచనల్లోనో పరధ్యానంగా ఉంటారు. కానీ, ఇక్కడ ఒక మహిళకు ఈ పరధ్యానమే ఊహించని షాక్ ఇచ్చింది. ఒక 27 ఏళ్ల మహిళ రాత్రి వేళ నిద్రపోయే ముందు మందు బిళ్ల అనుకుని పొరపాటున ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను మింగేసింది. ఆ తరువాత ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..

మందు బిళ్ల అనుకుని ఎయిర్‌పాడ్ మింగేసింది.. ఆ తర్వాత కడుపులోంచి వచ్చిన సౌండ్స్ చూసి అంతా షాక్!
Woman Swallows Airpod

Updated on: May 24, 2026 | 8:28 PM

కొన్నిసార్లు మనం పరధ్యానంలో చేసే చిన్న తప్పులు ఊహించని ప్రమాదాలకు, వింత పరిస్థితులకు దారితీస్తుంటాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే అమెరికాలో ఒక మహిళకు ఎదురైంది. అమెరికాలోని బోస్టన్‌కు చెందిన కార్లీ బెల్‌మర్ (Carli Bellmer) అనే 27 ఏళ్ల పాడ్‌కాస్టర్, మందు బిళ్ల అనుకుని పొరపాటున ఆపిల్ ఎయిర్‌పాడ్ (AirPod) మింగేసి వార్తల్లో నిలిచింది. అసలేం జరిగిందంటే?..

అమెరికాకు చెందిన 27 ఏళ్ల కార్లీ బెల్‌మర్ రాత్రి వేళ నిద్రపోవడానికి మంచంపైకి వెళ్లే ముందు తీవ్రమైన నొప్పితో బాధపడుతుంది. అందుకోసం ఆమె ఐబూప్రోఫెన్ (Ibuprofen) అనే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకోవాలని అనుకుంది. ఆ సమయంలో ఆమె ఒక చేతిలో పెద్ద పరిమాణంలో ఉన్న ఐబూప్రోఫెన్ 800 టాబ్లెట్, మరో చేతిలో తన ఎడమ చెవి ఎయిర్‌పాడ్‌ను పట్టుకుంది. అయితే తీవ్రమైన పరధ్యానంలో ఉన్న ఆమె, టాబ్లెట్‌కు బదులుగా ఎయిర్‌పాడ్‌ను నోట్లో వేసుకుని నీళ్లతో గటగటా మింగేసింది.

ఇవి కూడా చదవండి

మింగిన కొద్దిసేపటికి కానీ ఆమెకు తాను మింగేసింది టాబ్లెట్ కాదని, ఎయిర్‌పాడ్ అని అర్థం కాలేదు. వెంటనే వాంతి చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ అది బయటకు రాలేదు. ఆ సమయంలో అత్యంత విచిత్రమైన విషయం ఏమిటంటే… కడుపులోకి వెళ్లిన ఎయిర్‌పాడ్ అప్పటికీ ఆమె ఐఫోన్‌కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయ్యే ఉంది. ఆ కంగారులో ఆమె తన స్నేహితురాలికి ఒక వాయిస్ మెసేజ్ పంపగా, ఆ వాయిస్ నోట్ ఆడియో కడుపులో ఉన్న ఎయిర్‌పాడ్ నుండి స్పష్టంగా వినిపించింది.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వింత అనుభవాన్ని కార్లీ టిక్‌టాక్ (TikTok) వేదికగా నెటిజన్లతో పంచుకుంది. నేను పొరపాటున నా ఎయిర్‌పాడ్ మింగేశాను, నా బుర్ర పనిచేయడం లేదు అంటూ ఆమె పెట్టిన వీడియోకు లక్షలాది వ్యూస్ వచ్చాయి. కొందరు నెటిజన్లు ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపారేసినప్పటికీ, ఆ తర్వాత ఆమె చేయించుకున్న ఎక్స్-రే (X-ray) నివేదికలో ఆ ఎయిర్‌పాడ్ ఆమె జీర్ణవ్యవస్థ ద్వారా సురక్షితంగా బయటకు వచ్చేసినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ వింత సంఘటన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us