White Stag: స్వచ్ఛతకు చిహ్నం.. అందం అద్భుతం.. తెల్ల జింకను మీరెప్పుడైనా చూశారా..?

|

Nov 23, 2021 | 9:52 PM

White Antelope: సోషల్ మీడియా ప్రపంచంలో.. జంతువులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అయితే.. కొన్ని జంతువులను

White Stag: స్వచ్ఛతకు చిహ్నం.. అందం అద్భుతం.. తెల్ల జింకను మీరెప్పుడైనా చూశారా..?
White Stag
Follow us on

White Antelope: సోషల్ మీడియా ప్రపంచంలో.. జంతువులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అయితే.. కొన్ని జంతువులను చూసి నెటిజన్లు ఆశ్చర్యపడటంతోపాటు.. తెగ ఇష్టపడుతుంటారు. అలాంటి ఓ చిత్రం తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. ఫోటో చూసి నమ్మడం కష్టం కానీ.. ఇది నిజమైన ఫొటోనేనని పలువురు పేర్కొంటున్నారు. నెట్టింట తెల్ల జింక ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే. ఈ అరుదైన జాతి గురించి వినటం కానీ.. చూడటం కానీ చాలా అరుదు. ఇటీవల @LakotaMan1 అనే యూజర్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో తెల్ల జింక ఫొటోలను పంచుకున్నారు. దీతో ఇది ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్‌గా మారింది. ఈ చిత్రాన్ని షేర్ చేసి ఇలా రాశారు.. అరుదైన తెల్ల జింకలు.. వేటగాళ్లు వేటాడే అవకాశం ఉన్నందున అవి ఎక్కడున్నాయో చెప్పను అంటూ రాశారు. అయితే ఈ తెల్లని జింకను చూసి నెటిజన్లంతా అద్భుతంగా ఉందంటూ.. దాని అందం గురించి వర్ణిస్తున్నారు.

కాగా.. ఈ చిత్రాన్ని సోషల్ మీడియా యూజర్లు తెగ ఇష్టపడుతున్నారు. చాలా మంది వినియోగదారులు ఈ చిత్రంపై పలు కామెంట్లు చేస్తున్నారు. ఈ జాతిని వేటగాళ్ల నుంచి రక్షించాలంటూ షేర్ చేసిన వ్యక్తికి మద్దతుగా మరో యూజర్ నిలిచాడు. ఈ తెల్లటి జింక చాలా అందంగా ఉందని.. దయచేసి దీన్ని వేటగాళ్ల నుంచి రక్షించండి.. అంటూ రాశారు.


Also Read:

Viral Video: వీడు అసలు మనిషే కాదు.. ఎవ్వరైనా అలా చేస్తారా..? వీడియో చూస్తే మీరూ అలానే అంటారు..

Bride Dharna: మరికాసేపట్లో పెళ్లి.. హ్యాండిచ్చిన వరుడు.. ధర్నాకు దిగిన వధువు.. అసలేమైందంటే..?