వార్నీ ఇదేం ఊరు సామీ.. పొదామంటే దారేలేదు..ఇళ్ల కప్పులే నడిచే రోడ్లు! ఈ వింత గ్రామాన్ని చూశారంటే అవాక్కే!

ప్రపంచంలో ఎన్నో వింతలు, విచిత్రమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో విభిన్న గ్రామం ఒకటి ఉంది. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే.. ఒకరి ఇంటి పైకప్పు, మరొకరి ఇంటికి నడిచే దారిగా లేదా వీధిగా మారుతుంది. దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గ్రామంలోకి మోటారు వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. ఇక్కడి అద్భుతమైన నిర్మాణ శైలిని, ప్రకృతి అందాలను చూడటానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు తరలివస్తుంటారు. వినూత్నమైన ఈ గ్రామం పర్యాటక రంగంలో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. ఇంతకీ ఈ దారి లేని ఊరు ఎక్కడ ఉంది..? ఆ ఊరికి ఎలా వెళ్లాలో ఇప్పుడు చూద్దాం..

వార్నీ ఇదేం ఊరు సామీ.. పొదామంటే దారేలేదు..ఇళ్ల కప్పులే నడిచే రోడ్లు! ఈ వింత గ్రామాన్ని చూశారంటే అవాక్కే!
Village With No Roads

Updated on: Jul 09, 2026 | 11:02 AM

మనం నివసించే నగరాల్లో లేదా గ్రామాల్లో ఇళ్లు పక్కపక్కనే ఉంటాయి. వాటి మధ్యలో రోడ్లు ఉంటాయి. కానీ, ప్రపంచంలో ఒక వింత గ్రామం ఉంది. అక్కడ ఒకరి ఇంటి పైకప్పు, మరొకరి ఇంటికి ముందు ఉండే రోడ్డుగా మారుతుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. ఇరాన్‌లోని అల్బోర్జ్ పర్వత శ్రేణులలో ఉన్న మసూలే అనే గ్రామం ఈ వింతైన నిర్మాణ శైలికి ప్రపంచ ప్రసిద్ధి గాంచింది.

మెట్ల ఆకారంలో ఇళ్ల నిర్మాణాలు:

సముద్ర మట్టానికి దాదాపు 1,050 మీటర్ల ఎత్తులో ఉండే ఈ గ్రామాన్ని కొండ వాలుపై మెట్ల ఆకారంలో నిర్మించారు. ఒక ఇల్లు ముగిసే చోట.. మరో ఇల్లు ప్రారంభమవుతుంది. దీనివల్ల కింద ఉన్న ఇంటి పైకప్పు, పైన ఉన్న ఇంటికి ముందు భాగంలో ఉండే వీధిగా లేదా కాలినడక దారిగా మారుతుంది. ఇక్కడి ఇళ్లన్నీ పసుపు రంగు మట్టితో నిర్మితమై ఉంటాయి. దట్టమైన పొగమంచు కురిసే సమయంలో కూడా ఇళ్లు స్పష్టంగా కనిపించడానికి ఈ రంగును ఉపయోగించారు.

ఇవి కూడా చదవండి

వాహనాలకు నో ఎంట్రీ:

ఈ గ్రామంలోని వీధులు, దారులు చాలా ఇరుగ్గా, ఒక ఇంటి కప్పుతో మరొకటి అనుసంధానమై ఉంటాయి. అందువల్ల ఇక్కడికి ఎలాంటి మోటారు వాహనాలను కార్లు, బైకులు అనుమతించరు. భారీ వాహనాల వల్ల ఇళ్ల కప్పులు దెబ్బతినే ప్రమాదం ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ గ్రామంలో కేవలం కాలినడకన మాత్రమే ప్రయాణించాలి. వస్తువులను ఒకచోటు నుండి మరోచోటుకు చేరవేయడానికి స్థానికులు సాంప్రదాయ పద్ధతిలో గాడిదలను లేదా చేతి బండ్లను ఉపయోగిస్తారు.

వెయ్యి ఏళ్ల చరిత్ర – పర్యాటకుల స్వర్గధామం:

మసూలే గ్రామానికి దాదాపు 1,000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇక్కడి వాతావరణం, చుట్టూ ఉండే దట్టమైన అడవులు, జలపాతాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్టులు, ఆర్కిటెక్చర్లు ఈ వింత గ్రామాన్ని సందర్శించడానికి ఇష్టపడతారు. ఇక్కడి స్థానిక మార్కెట్లు, సాంప్రదాయ చేతివృత్తులు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయి.

భూకంపాలు, కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ప్రాచీన కాలంలోనే మన పూర్వీకులు ఎంతటి అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యంతో ఈ గ్రామాన్ని నిర్మించారో చెప్పడానికి మసూలే ఒక సజీవ సాక్ష్యం. మీకూ ఈ వింత గ్రామాన్ని సందర్శించాలని ఉందా?

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us