Viral Video: CM హెలికాఫ్టర్‌ ల్యాండ్ టైంలో.. పోలీసులకు ముచ్చెమటలు పచ్చించిన సీన్! వీడియో వైరల్

రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ కార్యక్రమం కోసం బీహార్‌లోని బెగుసరాయ్‌కి రానున్నారు. ఈ క్రమంలో అక్కడి అధికారులు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాక కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. మరికాసేపట్లో సీఎం హెలికాఫ్టర్‌ దిగేందుకు హెలిప్యాడ్ ప్రాంతం వద్ద హై సెక్యురిటీ కాపలా ఉంది. ఇంతలో అక్కడ ఊహించని ఘటన చోటు చేసుకుంది..

Viral Video: CM హెలికాఫ్టర్‌ ల్యాండ్ టైంలో.. పోలీసులకు ముచ్చెమటలు పచ్చించిన సీన్! వీడియో వైరల్
Cow Strayed Into Restricted Helipad Area In Bihar

Updated on: Mar 15, 2026 | 7:06 PM

బీహార్‌, మార్చి 15: ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఓ కార్యక్రమం కోసం బీహార్‌లోని బెగుసరాయ్‌కి రానున్నారు. ఈ క్రమంలో అక్కడి అధికారులు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాక కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. మరికాసేపట్లో సీఎం హెలికాఫ్టర్‌ దిగేందుకు హెలిప్యాడ్ ప్రాంతం వద్ద హై సెక్యురిటీ కాపలా ఉంది. ఇంతలో అక్కడ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదుగానీ ఓ ఆవు హెలీప్యాడ్‌ ప్రాంతంలోకి దూసుకుపోవడంతో భద్రతా సిబ్బంది గందరగోళంకి గురైంది. బరౌనిలోని బీహార్ ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ క్యాంపస్‌లో శనివారం (మార్చి 14) చోటు చేసుకున్న ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..

బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్ ‘సమృద్ధి యాత్ర’లో భాగంగా హెలికాప్టర్‌లో బెగుసరాయ్‌లోని బీహార్ ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ క్యాంపస్‌లో శనివారం (మార్చి 14) దిగాల్సి ఉంది. ఇప్పటికే అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. అధికారులు హెలికాప్టర్ రాక కోసం వేచి ఉండగా ఊహించని ప్రమాదం జరిగింది. ఓ ఆవు అకస్మాత్తుగా బారికేడ్ చేసిన హెలిప్యాడ్ జోన్ లోపలికి దూసుకు వచ్చింది. ఇది పోలీసు అధికారులు, ఆ ప్రదేశంలో ఉన్న ఇతర అధికారులలో భయాందోళనలను రేకెత్తించింది. ఆవు హెలిప్యాడ్ ప్రాంతం మీదుగా పరుగులు తీస్తూ కనిపించింది. దీంతో భద్రతా సిబ్బంది ఆవును అదుపు చేసేందుకు ప్రయత్నించేందుకు యత్నించగా.. దాని దాడి నుంచి తప్పించుకునేందుకు పోలీస్ సిబ్బంది పరుగులు తీసింది. ఆ తర్వాత కొంత దూరం పరుగెత్తి ఓ చోట ఆగిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చివరకు ఆవు హెలిప్యాడ్‌ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లింది. సీఎం రాక ముందే ఆవు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ప్రమాదం తప్పినట్లైంది.

ఇవి కూడా చదవండి

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో కొంతమంది పోలీసులు ఆవును వెంబడించడం చూడొచ్చు. మరికొందరు దానిని తప్పించుకోవడానికి ముందుకు పరిగెత్తగా.. ఆ ఆవు వారిపై దాడి చేసేందుకు యత్నించడం వీడియోలో చూడొచ్చు. చివరకు దాని దాడి నుంచి తప్పించుకున్నారు. ఇంతలో కొంతమంది భద్రతా సిబ్బంది కర్రలతో నిషేధిత ప్రాంతం నుంచి ఆవును తరిమికొట్టడానికి ప్రయత్నించడం వీడియోలో కనిపిస్తుంది. శ్రమించి, చివరికి ఆ ఆవును హెలిప్యాడ్ ప్రాంగణం నుంచి తరిమికొట్టారు. ఆవు చేసిన గందరగోళానికి అధికారులు సైతం కాసేపు నవ్వులు చిందించారు. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. మీరూ ఓ లుక్కేయండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us