Viral Video: పెద్ద జంతువు కోసం చిన్న జంతువు ఎర.. ప్లాన్ ఫెయిల్ అయితే..

|

Nov 20, 2022 | 4:46 PM

ఇటీవల కాలంలో అటవీ ప్రాంతాల్లోని సమీప గ్రామాల్లో అక్కడి ప్రజలకు పులులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పులులే కాదు. కొన్ని సందర్భాల్లో ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఎలుగుబంట్లు జనావాసాల్లోకి వచ్చి ప్రజలను ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. గ్రామాల్లో అయితే..

Viral Video: పెద్ద జంతువు కోసం చిన్న జంతువు ఎర.. ప్లాన్ ఫెయిల్ అయితే..
Man Uses Chicken To Trap A Python
Follow us on

ఇటీవల కాలంలో అటవీ ప్రాంతాల్లోని సమీప గ్రామాల్లో అక్కడి ప్రజలకు పులులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పులులే కాదు. కొన్ని సందర్భాల్లో ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఎలుగుబంట్లు జనావాసాల్లోకి వచ్చి ప్రజలను ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. గ్రామాల్లో అయితే రోజూ చిన్న చిన్న పాములు మొదలు.. నాగుపాముల వరకు ఇళ్లలోకి వచ్చి ప్రజలను ఇబ్బందులు పెడుతుంటాయి. పాములైతే చిన్న జంతువులే కాబట్టి.. వాటిని ఈజీగా బంధించడమో, ప్రాణం మీదకి వస్తే చంపడమో చేస్తారు. అదే పెద్ద పెద్ద కొండచిలువలు అయితే అదృష్టం ఉంటే దాని బారి నుంచి బయటపడతారు. లేదంటే బలైపోతారు. సాధారణంగా పాములంటేనే ఎవరికైనా వణుకుపుడుతుంది. ఇక పెద్ద పెద్ద కొండచిలువలు అంటే చెప్పనక్కర్లేదు. తాజాగా ఓ భారీ కొండచిలువకు సంబంధించిన వీడియో నెటిజన్లకు వణుకుపుట్టిస్తోంది. ఈ వీడియోలో ఓ కోడిని తన ఆహారంగా చేసుకోడానికి దూసుకొచ్చిన కొండచిలువ ఊహించని విధంగా ఇరుక్కుపోయింది. దానిని బంధించడానికి ఎరగా ఆ కోడిని ఉంచారని గ్రహించలేకపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో కొండచిలువను ప‌ట్టుకోడానికి ఓ కోడి పిల్లని ఉంచి దాని ముందు పైప్‌ను అమ‌ర్చారు. కోడి పిల్ల కోసం దూసుకొచ్చిన కొండ‌చిలువ పైప్‌లో ఇరుక్కుపోయి బ‌య‌ట‌కు రాలేక చాలా ఇబ్బంది పడింది. ఈ వీడియోను ఆడ్లీ టెర్రిఫైయింగ్ అనే ట్విట్టర్ పేజ్‌లో షేర్ చేశారు. కోడిని ఉప‌యోగిస్తూ పైథాన్‌కు ట్రాప్ అని ఈ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ వీడియోను 50 ల‌క్షల మందికి పైగా వీక్షించారు. వేలల్లో లైక్‌ చేశారు. వీడియో నిజంగా వెన్నులో వ‌ణుకుపుట్టించేలా ఉందని ఓ యూజర్‌ కామెంట్‌ చేస్తే, ఇంతకీ ఎరగా వేసిన కోడి బతికి ఉందా లేదా అంటూ మరికొంతమంది కామెంట్స్ చేశారు. ఇంకొందరైతే ఈ వీడియో పైశాచికంగా ఉంద‌ని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత ఎక్కవ ఏ చిన్న ఘటన జరిగినా నోట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా కొండచిలువకు సంబంధించిన వీడియో చూస్తే మాత్రం ప్లాన్ ఫెయిల్ అయిఉంటే మాత్రం ఎంతమంది బలయ్యేవారో అనే కామెంట్స్ కూడా కొంతమంది నెటజన్లు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..