అమ్మబాబోయ్.. చూస్తుండగానే మనిషి అమాంతం మింగేసిన సొరచేప..! వీడియో వైరల్‌..

|

Jun 10, 2023 | 9:09 AM

సముద్రంలో ఈతకు వెళ్లిన తమ కుమారుడిని కళ్లముందే సొరచేప తినేసింది. ఈ దారుణ ఘటనను చూసిన ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. నిస్సహాయంగా చూడడం తప్ప ఆ కుటుంబానికి ఇంకే దారి దొరకలేదు. అక్కడే ఉన్న కోస్ట్‌గార్డ్‌ వచ్చేలోపే మనిషిని మింగేసింది ఆ సొరచేప. డాడీ .. కాపాడు అంటూ కేకలు వేశాడు ఆ టీనేజర్‌. సెకన్లలోనే కాపాడేందుకు అక్కడున్నవారు పడవలో వెళ్లేసరికే సొరచేపకు ఆహారంగా మారిపోయాడు.

అమ్మబాబోయ్.. చూస్తుండగానే మనిషి అమాంతం మింగేసిన సొరచేప..! వీడియో వైరల్‌..
Tiger Shark Attack
Follow us on

ఛత్రపతి సినిమాలో సొరచేపతో పోరాడతాడు హీరో ప్రభాస్‌. కాని నిజంగా సొరచేప దాడి చేస్తే ఎలా ఉంటుంది..? ఊహించడానికి కూడా భయంగా ఉంది కదా.. ఈజిప్టులో ఓ టైగర్‌ షార్క్‌ మనిషిని అమాంతం నమిలి మింగేసింది. బీచ్‌లో కాసేపు సరదాగా సేదదీరుదామని వచ్చిన ఓ టీనేజర్‌ని 20 సెకన్లలోనే ఖతం చేసింది. వామ్మో ఇది వినటానికే ఇంత భయంకరంగా ఉంటే.. ఇక షార్క్ దాడి దృశ్యాలు చూసిన వాళ్ళ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. అసలు ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది.. ఎందుకు ఆ వ్యక్తి సోర నోటికి చిక్కాడు.. అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఈజిప్టు దేశ పర్యాటక అందాలు తిలకించేందుకు వెళ్లిన ఓ రష్యా కుటుంబంలో అంతులేని విషాదం నెలకొంది. సముద్రంలో ఈతకు వెళ్లిన తమ కుమారుడిని కళ్లముందే సొరచేప తినేసింది. ఈ దారుణ ఘటనను చూసిన ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. నిస్సహాయంగా చూడడం తప్ప ఆ కుటుంబానికి ఇంకే దారి దొరకలేదు. అక్కడే ఉన్న కోస్ట్‌గార్డ్‌ వచ్చేలోపే మనిషిని మింగేసింది ఆ సొరచేప.

డాడీ .. కాపాడు అంటూ కేకలు వేశాడు ఆ టీనేజర్‌. సెకన్లలోనే కాపాడేందుకు అక్కడున్నవారు పడవలో వెళ్లేసరికే సొరచేపకు ఆహారంగా మారిపోయాడు. రష్యాకు చెందిన పోపోవ్ తన కుటుంబంతో కలిసి ఈజిప్టు పర్యటనకు వెళ్లారు. ఎర్రసముద్రం తీరంలోని ఓ రిసార్ట్‌లో బస చేసి తన ప్రియురాలితో కలిసి ఈత కొట్టాడు. ఇంతలో అక్కడకు వచ్చిన టైగర్ షార్క్ పోపోవ్‌ను సమీపించి అతడిపై దాడి చేసింది. డాడీ.. నన్ను కాపాడు అంటూ అతను కేకలు వేశాడు. ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చే ప్రయత్నం చేశాడు. కానీ షార్క్ నుండి తప్పించుకోలేకపోయాడు. ఆ యువకుడ్ని షార్క్ నమిలి మింగేసింది. ఆ శరీరంతో రెండు గంటల పాటు ఆడుకుంది! అక్కడి మత్స్యకారులు షార్క్‌ను వెంటాడి వేటాడారు. చివరికి పోపోవ్‌ కాలు తప్ప మరేమీ మిగల్లేదు. ఈ ఘటన తర్వాత ఈజిప్టు బీచ్‌లు అన్నీ మూసేశారు. పర్యాటకులు బీచ్‌లలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీచేసింది ఈజిప్టు పర్యాటక శాఖ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ..