Viral Video: ఎలుక అనుకుని దగ్గు మందు బాటిల్‌ను మింగిన పాము.. ఆ తర్వాత

|

Jul 04, 2024 | 1:35 PM

పాములు ఆహారం దొరక్క అల్లాడిపోతున్నప్పుడు ఏది కనిపించినా మింగేందుకు యత్నించి రిస్కులో పడుతూ ఉంటాయి. ఇక్కడ ఓ నాగుపాము కూడా అలానే ఆహారంగా భావించి.. దగ్గు మందు బాటిల్‌ను మింగేందుకు యత్నించింది. ఆ తర్వాత.....

Viral Video: ఎలుక అనుకుని దగ్గు మందు బాటిల్‌ను మింగిన పాము.. ఆ తర్వాత
Cobra
Follow us on

పాములు చేసే పనులు కొన్నిసార్లు ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఫుడ్ దొరక్క ఆకలితో అలమటిస్తున్న పాములు.. ఏది దొరికితే అది తినేందుకు యత్నించి రిస్క్‌లో పడతాయి. ఇదిగో ఇక్కడ కూడా అలాంటి సీనే జరిగింది. ఓ నాగుపాము.. దగ్గు మందు డబ్బాను మింగేందుకు యత్నించింది. అది కాస్త గొంతులో ఇరక్కపోయి అల్లాడిపోయింది. ఊపిరి పీల్చుకోలేక తెగ ఇబ్బంది పడింది. ఒడిశాలోని భువనేశ్వర్‌లోని ఈ ఘటన వెలుగుచూసింది. దాని అవస్థను గుర్తించిన స్థానికులు.. వెంటనే.. స్నేక్ హెల్ప్‌లైన్ సభ్యులకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీం పాము గొంతులోని బాటిల్‌ను జాగ్రత్తగా బయటకు తీశారు. ప్రమాదం అని తెలిసినప్పటికీ.. వారు దాని ప్రాణాలు కాపాడేందుకు వెనక్కి తగ్గలేదు. పాము గొంతు నుంచి బాటిల్‌ను సురక్షితంగా బయటకు నెట్టడం మీరు దిగువన వీడియోలో చూడవచ్చు.

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి సుశాంత నందా X లో పామును రెస్క్యూ చేసిన వీడియోను షేర్ చేశారు. అది కాస్త వైరల్‌గా మారింది. దాదాపు 90 వేల వ్యూస్ రాగా నెటిజన్స్ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. “వారు మంచే చేశారు కానీ చేతికి గ్లౌజ్ వేసుకుని ఉంటే బాగుండేది.. ఒక ప్రాణం కోసం మరో ప్రాణాన్ని రిస్కులో పెట్టకూడదు కదా” అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. “ఈ సృష్టిలో ప్రతి ప్రాణం సమానమైనది. ఈ రోజు మీరెక జీవికి ప్రాణ భిక్ష పెట్టారు” అని మరో యూజర్ వ్యాఖ్యానించారు. “ఇప్పటికే ఎన్నో జీవులు అంతరించిపోయాయి. మనుషులు మారకుండా ఇలానే చెత్త ఎక్కడపడితే అక్కడ వేస్తే జీవ వైవిధ్యం అన్నదే కనుమరుగు అవుతుంది” అని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..