AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇద్దరు పిల్లలు పుట్టినంక ప్రియుడితో భార్య యవ్వారం… భర్త ఏం చేశాడంటే..

ఉత్తర ప్రదేశ్‌లో ఇటీవల భార్య భర్తల మధ్య అనూహ్య సంఘటనలు జరుగుతున్నాయి. భార్యకు ప్రియుడితో పెళ్లి జరిపించడం వంటి సంఘటనలు ఆ రాష్ట్రంలో ఇటీవల వరుసగా జరుగుతున్నాయి. అలాంటి సంఘటనే మరొకటి జరిగింది. ఓ మహిళకు అప్పటికే పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా సాగాల్సిన వారి కాపురం ఒక్కసారిగా కుదుపుకు...

Viral Video: ఇద్దరు పిల్లలు పుట్టినంక ప్రియుడితో భార్య యవ్వారం... భర్త ఏం చేశాడంటే..
Husband Gets Wife Married T
K Sammaiah
|

Updated on: Apr 10, 2025 | 7:06 PM

Share

ఉత్తర ప్రదేశ్‌లో ఇటీవల భార్య భర్తల మధ్య అనూహ్య సంఘటనలు జరుగుతున్నాయి. భార్యకు ప్రియుడితో పెళ్లి జరిపించడం వంటి సంఘటనలు ఆ రాష్ట్రంలో ఇటీవల వరుసగా జరుగుతున్నాయి. అలాంటి సంఘటనే మరొకటి జరిగింది. ఓ మహిళకు అప్పటికే పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా సాగాల్సిన వారి కాపురం ఒక్కసారిగా కుదుపుకు గురయింది. భర్త సర్వస్వంగా బతకాల్సిన ఆ మహిళ మరో వ్యక్తితో ప్రేమలో పడింది. గుట్టుగా ఇంట్లోనే ఉంటూ కథ నడిపిస్తోంది. అయితే ఆలస్యంగా విషయం తెలుసుకున్న భర్త.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి చేసేశాడు.

ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఆశ్చర్యకరమైన సంఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పప్పు అనే వ్యక్తి తన భార్యను ఆమె కంటే చాలా చిన్న వయసున్న ప్రేమికుడితో వివాహం జరిపించాడు. ఈ అసాధారణ సంఘటన కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాలలో పెరుగుతున్న ధోరణిని చాటి చెబుతోంది.

పప్పు భార్య స్థానిక యువకుడితో ప్రేమలో పడింది. ఆమె కన్నా అతను చాలా చిన్నవాడు, పైగా నిరుద్యోగి. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆ మహిళ చాలా కాలంగా తన ప్రేమికుడిని రహస్యంగా కలుస్తోంది. ఈ వ్యవహారం భర్తకు తెలిసింది. సమాజం నుండి నిరంతరం నిందలను ఎదర్కొన్నాడు. భార్యకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించాడు. చివరికి విసిగిపోయిన పప్పు వారికి వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నాడు.

చివరికి భార్యకు ఆమె ప్రియుడికి భర్తే దగ్గరుండి వివాహం జరిపించాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్‌ రకరకాలుగా స్పందిస్తున్నారు.

వీడియో చూడండి:

Follow Us
నేటి నుంచే AP ICET 2026 ప్రవేశాలు.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు షురూ
నేటి నుంచే AP ICET 2026 ప్రవేశాలు.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు షురూ
పసిడి ధర మరింత పెరుగుతుందా..? పెట్టుబడులకు ఇదే బెస్ట్ టైమా..?
పసిడి ధర మరింత పెరుగుతుందా..? పెట్టుబడులకు ఇదే బెస్ట్ టైమా..?
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్..
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్..
కృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ 3నా.. 4నా? పూజ, నిశిత కాలం, ఉపవాస..
కృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ 3నా.. 4నా? పూజ, నిశిత కాలం, ఉపవాస..
ఒకే ఓవర్లో 2 వికెట్లతో చెలరేగిన బుడ్డోడు.. సెలబ్రేషన్స్ చూశారా..?
ఒకే ఓవర్లో 2 వికెట్లతో చెలరేగిన బుడ్డోడు.. సెలబ్రేషన్స్ చూశారా..?
ఇరుముడి టీచర్ ఒకప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్ తెలుసా..
ఇరుముడి టీచర్ ఒకప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్ తెలుసా..
RRB NTPC UG 2026 ఫలితాలు వచ్చేశాయ్‌.. స్కోర్‌ కార్డు డౌన్‌లోడ్
RRB NTPC UG 2026 ఫలితాలు వచ్చేశాయ్‌.. స్కోర్‌ కార్డు డౌన్‌లోడ్
ఇరాన్ ఉద్రిక్తతలు-వాషింగ్టన్ వ్యూహాన్ని తప్పుబట్టిన బీజింగ్!
ఇరాన్ ఉద్రిక్తతలు-వాషింగ్టన్ వ్యూహాన్ని తప్పుబట్టిన బీజింగ్!
అరచేతిలో చేప గుర్తు ఉందా? ఈ శుభసూచకాలు మీ జీవితంలో సంపద, అదృష్టం
అరచేతిలో చేప గుర్తు ఉందా? ఈ శుభసూచకాలు మీ జీవితంలో సంపద, అదృష్టం
సోదరి లేకుంటే.. రాఖీ కట్టే హక్కు ఎవరికి ఉంది?
సోదరి లేకుంటే.. రాఖీ కట్టే హక్కు ఎవరికి ఉంది?