Watch: వార్నీ ఇదెక్కడి వింత.. సముద్రంలో మద్యం పోసిన మహిళ..హఠాత్తుగా పైకి లేచిన మత్స్యకన్యలు..! కట్‌చేస్తే..

సోషల్ మీడియాలో ప్రతి వీడియో వైరల్ అవుతుందని ఖచ్చితంగా చెప్పలేం. అలాంటి వీడియోలకు వాటి స్వంత రిస్క్ ఉంటుంది. ఇక్కడ కూడా ఒక ఆశ్చర్యకరమైన వీడియో వైరల్‌ అవుతోంది. ఇందులో ఒక మహిళ సముద్రంలో మద్యం పోసిన వెంటనే, చాలా మంది అందమైన అమ్మాయిలు మత్స్యకన్యల వలె బయటకు వచ్చారు. అంటే ఆ మహిళ వైన్ పోయడం వల్ల అక్కడి చేపలు అమ్మాయిలుగా మారిపోయారన్నమాట..! పూర్తి వివరాల్లోకి వెళితే...

Watch: వార్నీ ఇదెక్కడి వింత.. సముద్రంలో మద్యం పోసిన మహిళ..హఠాత్తుగా పైకి లేచిన మత్స్యకన్యలు..! కట్‌చేస్తే..
Mermaids

Updated on: Sep 16, 2025 | 8:25 AM

సోషల్ మీడియాలో వీడియోలను వైరల్ చేయడానికి చాలా మంది తమలోని ట్యాలెంట్‌నంతా బయటపెడుతున్నారు. కొందరు సృజనాత్మక ఆలోచనలను అవలంబిస్తారు. కొందరు స్పెషల్ ఎఫెక్ట్స్ సహాయం తీసుకుంటారు. మరికొందరు కంటెంట్‌ను చాలా ఫన్నీగా, ఆసక్తికరంగా మార్చడానికి ప్రయత్నిస్తారు. అదే సమయంలో చాలా మంది తమ నటన ఆధారంగా వీడియో వైరల్ అవుతుందని ఆశిస్తుంటారు. కానీ, నిజం చెప్పాలంటే..ప్రతి వీడియో వైరల్ అవుతుందని ఖచ్చితంగా చెప్పలేం. అలాంటి వీడియోలకు వాటి స్వంత రిస్క్ ఉంటుంది. ఇక్కడ కూడా ఒక ఆశ్చర్యకరమైన వీడియో వైరల్‌ అవుతోంది. ఇందులో ఒక మహిళ సముద్రంలో మద్యం పోసిన వెంటనే, చాలా మంది అందమైన అమ్మాయిలు మత్స్యకన్యల వలె బయటకు వచ్చారు. అంటే ఆ మహిళ వైన్ పోయడం వల్ల అక్కడి చేపలు అమ్మాయిలుగా మారిపోయారన్నమాట..! పూర్తి వివరాల్లోకి వెళితే…

వైరల్‌ వీడియో కోసం కొంతమంది మహిళలు ఎంతో సృజనాత్మకమైన ఆలోచన చేశారు. వీడియోలో ఒక మహిళ సముద్రంలో పడవ ప్రయాణం చేస్తోంది. పడవలో కూర్చుని ఉన్న ఆమె.. సముద్రంలోకి వైన్ పోస్తుంది. ఆమె ఇలా చేసిన వెంటనే అకస్మాత్తుగా ఐదు నుండి ఆరుగురు చాలా అందమైన అమ్మాయిలు నీటి నుండి బయటకొచ్చారు.. నీటిలో ఆహారం చూసినప్పుడు చేపలు ఎలా ఎగురుతూ, ముఖాలు కదిలిస్తాయో.. అచ్చం ఈ ఆడవాళ్లు కూడా అలాగే చేస్తున్నారు. బహుశా వీడియోలో ప్రత్యేక వైన్ పోయడం ద్వారా చేపలు అందమైన అమ్మాయిలుగా మారుతాయని చూపించడానికి ప్రయత్నించి ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి

ప్రపంచ వ్యాప్తంగా మత్స్యకన్యల గురించి ప్రజల్లో చాలా ఉత్సుకత ఉంటుంది. మత్స్యకన్యలు పాశ్చాత్య ఇతిహాసాల పౌరాణిక జీవులు. వీటి శరీరం పై భాగం మానవుడిలా ఉంటుంది. దిగువ భాగం చేప తోకలా ఉంటుంది. కథలు, జానపద కథలు, సముద్రానికి సంబంధించిన కథలలో వీటిని ప్రస్తావించారు. మత్స్యకన్యల ఉనికిని నిరూపించడానికి నిజమైన ఆధారాలు లేవు. మనాటీ వంటి జల క్షీరదాలను మత్స్యకన్యలుగా పరిగణించడం వల్ల ఇలాంటివి తరచుగా జరుగుతాయి. వీడియోలో మత్స్యకన్యల గురించి ప్రస్తావించకపోయినా, వారు మత్స్యకన్యల వలె కనిపించారు. కానీ, వారు నీటి నుండి బయటకు వచ్చే విధానం చూస్తే వారు మత్స్యకన్యలు అని అనిపిస్తుంది. అందమైన అమ్మాయిలను దేవకన్యలు, అప్సరసలు అని పిలుస్తుంటారు. అలాగే, నీటిలో ఈత కొట్టే అందమైన అమ్మాయిలను మత్స్యకన్యలు అని పిలుస్తారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియోను @quinngadot ఖాతా నుండి Instagramలో షేర్ చేశారు. దీనికి ఇప్పటివరకు 90 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. చాలా మంది వీడియోకి స్మైలీ ఎమోజీలతో ప్రతిస్పందించారు. చాలా ఫన్నీ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..