Viral Video: కసరత్తులు చేద్దామనుకున్నాడు.. కానీ బొక్కబోర్లా పడ్డాడు.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

|

Nov 27, 2021 | 9:58 PM

Exercise Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఫన్నీ వీడియోలు చాలా వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని నవ్వును తెప్పిస్తే మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా వైరల్

Viral Video: కసరత్తులు చేద్దామనుకున్నాడు.. కానీ బొక్కబోర్లా పడ్డాడు.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Viral Video
Follow us on

Exercise Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఫన్నీ వీడియోలు చాలా వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని నవ్వును తెప్పిస్తే మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా వైరల్ అయిన వీడియోను చూస్తే మీరు అస్సలు నవ్వు ఆపుకోకుండా ఉండలేరు. ఈ వీడియోను చూసి నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా మన శరీరానికి ఆహారం తీసుకోవడం, నీరు త్రాగడం ఎంత ముఖ్యమో వ్యాయామం కూడా అంతే ముఖ్యం. రెగ్యులర్ వ్యాయామం మనల్ని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఫిట్‌గా ఉంచుతుంది. అందుకే చాలామంది ప్రతిరోజూ కొంతసమయాన్ని వ్యాయామానికి కెటాయిస్తుంటారు. అయితే.. ఇలాంటి సమయాల్లో కొన్ని కసరత్తులు కూడా చేస్తుంటారు. అలా చేస్తూ అనవసరంగా ఇబ్బందుల్లో కూరుకుపోతారు. తాజాగా వైరల్ అయిన వీడియోలో ఒక వ్యక్తి బెంచ్‌పై కూర్చొని వ్యాయామం చేస్తుంటాడు.. ఈ క్రమంలో జరిగిన సన్నివేశం అందరినీ తెగ నవ్విస్తోంది.

బెంచ్‌పై ఒక కూర్చుని కసరత్తులు చేయడాన్ని వైరల్ అవుతున్న వీడియోలో మీరు చూడవచ్చు. బెంచ్‌పై కూర్చొని.. మెడను వెనుకకు వాల్చుతాడు. ఈ క్రమంలో అతని బ్యాలెన్స్ చెదిరిపోయి వెనక్కి పడిపోతాడు. అయితే.. పడిన వెంటనే ఎవరైనా చూశారేమో అనుకొని.. మళ్లీ వెంటనే లేచి ఎక్సర్ సైజ్ చేయడం ప్రారంభిస్తాడు. అయితే.. దీన్ని చూసిన తర్వాత నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోను ఓసారి చూడండి..

వైరల్ వీడియో..

ఈ వైరల్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో hepgul5 అనే పేజీలో షేర్ చేశారు. ఈ వీడియోను వేలాది మంది వీక్షించి లైక్ చేస్తున్నారు. దీంతోపాటు పలురకాల ఫన్నీ కామెంట్లు కూడా చేస్తున్నారు. వీడియో నిజంగా ఫన్నీగా ఉందని.. ఓ వ్యక్తి పేర్కొనగా.. అనవసర కసరత్తులు ఇబ్బందుల్లో పడేస్తాయని మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు.

Also Read:

Viral News: రాతితో చేసిన మొసలి అనుకుని.. దానిపై చేయివేసి ఓ వృద్ధుడు సెల్ఫీకి యత్నం.. మరణం అంచువరకూ వెళ్లి వచ్చిన వైనం..

Andhra Pradesh: రోడ్డు పక్కన ఆగిన కారు.. డోర్ ఓపెన్ చేసి చూడగా ఫ్యూజులు ఔట్.!