Viral Video: స్టూడెంట్స్‌తో కలిసి బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్‌కి డ్యాన్స్ చేసిన కలెక్టర్.. నెట్టింట్లో వీడియో వైరల్

|

Apr 03, 2022 | 9:59 AM

Viral Video: ఇంటర్నెట్, సోషల్ మీడియా(Social Midea) ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. రకరకాల వీడియోలు షేర్ చేస్తూనే ఉన్నారు. నెటిజన్లను ఈ వీడియోలు ఆకర్షిస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ జిల్లా కలెక్టర్..

Viral Video: స్టూడెంట్స్‌తో కలిసి బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్‌కి డ్యాన్స్ చేసిన కలెక్టర్.. నెట్టింట్లో వీడియో వైరల్
Kerala District Collector
Follow us on

Viral Video: ఇంటర్నెట్, సోషల్ మీడియా(Social Midea) ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. రకరకాల వీడియోలు షేర్ చేస్తూనే ఉన్నారు. నెటిజన్లను ఈ వీడియోలు ఆకర్షిస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ జిల్లా కలెక్టర్(District Collector) బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ కు నృత్యం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కేరళలోని ఒక జిల్లా కలెక్టర్.. విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్ మాబ్‌లో చేరిన డ్యాన్స్ చేశారు. స్టూడెంట్స్ తో సమానంగా ఎంతో ఉత్సాహంగా స్టెప్స్ వేసిన ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అజిన్ పథనంతిట్ట(Ajin Pathanamthitta) ఫేస్‌బుక్‌లో ఓ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో పాతానంతిట్ట జిల్లా కలెక్టర్‌.. IAS అధికారి దివ్య ఎస్ అయ్యర్‌ కనిపిస్తున్నారు. కేరళలోని సెంట్రల్ ట్రావెన్‌కోర్ ప్రాంతంలో ఉన్న పతనంతిట్ట ఒక మునిసిపాలిటీ. ఆహ్లాదకరమైన ఈ వీడియోలో.. దివ్య అయ్యర్ రణవీర్ సింగ్-దీపికా పదుకొణె నటించిన గోలియోన్ కీ రాసలీలా రామ్-లీలా లోని గాన సాంగ్ ధోల్ పాటకు విద్యార్థులతో కలిసి నృత్యం చేశారు.
“విద్యార్థులతో కలిసి దివ్య పాటను ఎంజాయ్ చేస్తూ.. చక్కగా డ్యాన్స్ చేశారు. మహాత్మా గాంధీ యూనివర్శిటీ ఆర్ట్ ఫెస్టివల్ ను ప్రకటించింది. ఈ నేపధ్యంలో జిల్లా స్టేడియంలో కళాశాల విద్యార్థులు ఫ్లాష్ మాబ్‌ను ఏర్పాటు చేశారు. ఫెస్టివల్ ను దీప ప్రజ్వలనంతో ప్రారంభించడానికి వేదికమీడకు ఐఏఎస్ అధికారిని దివ్య రావడంతో.. స్టూడెంట్స్ తమతో పాటు డ్యాన్స్ చేయమని కలెక్టర్ ను కోరారు. దీంతో స్టూడెంట్స్ తో పాటు దివ్య జాయిన్ అయ్యారు.

 

ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విశేష ఆదరణ లభించింది. అయ్యర్ స్ఫూర్తిని ప్రజలు ప్రశంసించారు. విద్యార్థులతో సరదాగా గడిపినందుకు దివ్యపై పొగడ్తల వర్షం కురిపించారు.

Also Read: Health Tips: మోకాళ్లు, కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్‌తో ఇబ్బంది పడుతున్నారా.. బెస్ట్ మెడిసిన్ ఈ ఆకుల రసం

Butter Milk: వేసవిలో పెరుగు కంటే మజ్జిగ ఆరోగ్యానికి మేలు..మజ్జిగను భూలోక అమృతం అంటారు ఎందుకో తెలుసా..