Viral Video: ఆర్మీ జవాన్ ప్రాణాలను కాపాడిన మొబైల్ ఫోన్.. బుల్లెట్ ఎలా దిగిందో చూడండి..!

|

Apr 20, 2022 | 10:24 PM

Viral Video: ఓ ఆర్మీ జవాన్‌ను మొబైల్‌ ఫోన్‌ కాపాడింది. అది కూడా బెల్లెట్‌ తగలకుండా. అదేంటి బుల్లెట్‌నే అడ్డుకునేంత శక్తి ఓ మొబైల్‌ ఫోన్‌కు ఉందా..?

Viral Video: ఆర్మీ జవాన్ ప్రాణాలను కాపాడిన మొబైల్ ఫోన్.. బుల్లెట్ ఎలా దిగిందో చూడండి..!
Soldiers
Follow us on

Viral Video: ఓ ఆర్మీ జవాన్‌ను మొబైల్‌ ఫోన్‌ కాపాడింది. అది కూడా బెల్లెట్‌ తగలకుండా. అదేంటి బుల్లెట్‌నే అడ్డుకునేంత శక్తి ఓ మొబైల్‌ ఫోన్‌కు ఉందా..? అంటే అవుననే అంటున్నాడు ఉక్రెయిన్‌కు చెందిన ఓ జవాన్‌. ఇంతకీ ఓ మొబైల్‌ ఫోన్‌ అతడిని ఎలా రక్షించిందో తెలుస్తే షాక్‌ అవుతారు.

ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య జ‌రుగుతున్న వార్‌లో ఓ సైనికుడు త‌న వ‌ద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్‌తో ప్రాణాలు ద‌క్కించుకున్నాడు. దూసుకువ‌స్తున్న బుల్లెట్ల నుంచి త‌ప్పించుకునేందుకు న‌క్కి న‌క్కి వెళ్తున్న ఓ ఉక్రెయిన్ సైనికుడి వైపుకు ఓ బుల్లెట్‌ దూసుకొచ్చింది. తన పయింట్‌ వెనక భాగంలో తన సెల్‌ఫోన్‌ను ఉంచుకున్నాడు. అదే సమయంలో వెనకాల నుంచి వచ్చిన బుల్లెట్‌ మొబైల్‌ ఫోన్‌పై ఫైర్‌ అయి, అందులోనే ఇరుక్కుపోయింది. ఆ తర్వాత త‌న పాకెట్ నుంచి ఫోన్ తీయ‌గా.. ఆ ఫోన్ వెనుక భాగంలో బుల్లెట్ ఉండటం చూసి షాక్‌ అయ్యాడు ఆ జవాన్‌. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

Viral Video:

Also read:

Telangana Jobs: ప్రభుత్వ ఉద్యోగార్థులకు అలర్ట్.. త్వరలో 13 వేల టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..!

Two Wheeler Loan: బైక్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అతి తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్న బ్యాంకులు ఇవే..!

Astro Tips: బుధవారం రోజు ఇలా చేస్తే ఉద్యోగం, వ్యాపారంలో అద్భుత విజయం వరిస్తుంది..!