ఆ వైరల్ వీడియోలు గచ్చిబౌలి క్వారంటైన్ సెంటర్‌వి కావు

క్వారంటైన్ సెంటర్‌లో ఉన్న వారు క్రికెట్ ఆడుతూ, డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న రెండు వీడియోలు ఈ మధ్యన సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి.

ఆ వైరల్ వీడియోలు గచ్చిబౌలి క్వారంటైన్ సెంటర్‌వి కావు
Follow us

| Edited By:

Updated on: Jun 14, 2020 | 8:11 AM

క్వారంటైన్ సెంటర్‌లో ఉన్న వారు క్రికెట్ ఆడుతూ, డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న రెండు వీడియోలు ఈ మధ్యన సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. అవి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి క్వారంటైన్ సెంటర్‌లో అన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఆ వీడియోలు ఇక్కడివి కావని ఫాక్ట్‌ చెక్‌లో తేలింది. అందులో బెడ్లు అన్నీ పక్కకు జరిపి క్రికెట్ ఆడుతున్న వీడియో జమ్ముకశ్మీర్‌ బారాముల్లాలో క్వారంటైన్ సెంటర్‌ది అని గుర్తించారు. అంతేకాదు జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి సైతం ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇక క్వారంటైన్ సెంటర్‌లో లుంగీ డ్యాన్స్‌ చేస్తున్న వీడియో త్రిపుర రాజధాని అగర్తలోనిదని ఫాక్ట్ చెక్‌లో తేలింది. కాగా ఈ వీడియోలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో క్వారంటైన్ సెంటర్‌లో భౌతిక దూరం కూడా పాటించడం లేదని, వారికి కనీసం చెప్పేందుకు సిబ్బంది కూడా లేరని.. వారిపై చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు. కాగా కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంను ఐసోలేషన్‌ సెంటర్‌గా మార్చిన విషయం తెలిసిందే.

Read This Story Also: ఈ నెల 21న కాణిపాకం ఆలయం మూసివేత