Shocking Video : 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడం చూశారా..!

Shocking: సోషల్ మీడియాలో ప్రతిరోజు వందల సంఖ్యలో వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే మరికొన్ని ఆశ్చర్యకరమైన వీడియోలు

Shocking Video : 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడం చూశారా..!
Building Collapse

Updated on: Mar 30, 2022 | 11:34 AM

Shocking: సోషల్ మీడియాలో ప్రతిరోజు వందల సంఖ్యలో వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే మరికొన్ని ఆశ్చర్యకరమైన వీడియోలు ఉంటాయి. తాజాగా ఒక షాకింగ్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీరు కూడా షాక్‌ అవుతారు. ఈ వీడియోలో ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలుతుంది. ఇలాంటి సంఘటనలు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు జరుగుతుంటాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడం మనం చూడవచ్చు. ఈ ఎత్తైన భవనం కింద ఒక చిన్న ఇల్లు కూడా సమాధి అవుతుంది. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్‌లో జరిగింది. కొన్ని నెలల క్రితం భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతాయి. దీంతో ఇంత పెద్ద భవనం ఒక్కసారిగా నేలమట్టం అవుతుంది. అయితే ఇలాంటి దృశ్యాలు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో తరచుగా కనిపిస్తాయి. చాలాసార్లు కొండచరియలు విరిగిపడటం వల్ల పెద్ద పెద్ద ఇళ్లు దెబ్బతింటాయి. ఒక్కోసారి రోడ్లు మొత్తం దెబ్బతిని భారీగా ట్రాఫిక్‌ జామ్ కూడా ఏర్పడుతుంది.

ఈ షాకింగ్ వీడియోని ఒక నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోని ఇప్పటివరకు 37 వేల మంది చూశారు. 35 వేల మందికి పైగా లైక్ చేసారు. అంతేకాదు ఈ వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్‌లు ఇచ్చారు. భవనం కుప్పకూలిన తీవ్రతను చూసిన ఓ నెటిజన్ ‘ఆ ఇంట్లో ఎవరూ లేరు కదా దేవుడా’ అంటూ కామెంట్ చేశాడు. చాలామంది వివిధ రకాలుగా కామెంట్ చేశారు. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్‌ తెలియజేయండి.

Viral Video: ఫుడ్ ప్లేట్‌లో నోరు తెరిచిన చేప.. అవాక్కయిన కస్టమర్..

Travel News: ప్రకృతి అందాలకు నెలవు ఈశాన్య భారతం.. సమ్మర్‌లో ఈ ప్రదేశాలు అస్సలు మిస్‌ కావొద్దు..!

Aadhaar-Pan Link: ఈ వ్యక్తులకి ఆధార్-పాన్ లింక్‌ అవసరం లేదు.. మిగతా వారికి తప్పనిసరి..!