Viral Video: కదులుతున్న ట్రక్కుతో ఇద్దరు అబ్బాయిలు డేంజరస్ స్టంట్.. షాకింగ్ వీడియో వైరల్

|

Aug 14, 2024 | 12:49 PM

ఇద్దరు బాలురు కదులుతున్న ట్రక్కుకు ఇరువైపులా పట్టుకుని వెళ్తున్న వీడియో వైరల్ అవుతోంది. దీని తరువాత ఒక బాలుడు ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం ప్రారంభించాడు. మరొక బాలుడు దానిని చిత్రీకరిస్తున్నాడు. సేఫ్టీ ఎక్విప్‌మెంట్ లేకుండా అబ్బాయిలిద్దరూ స్టంట్‌ చేయడం వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియోను సోషల్ సైట్‌లో షేర్ చేసి ఇలాంటి విన్యాసాలు చేస్తూ మీ ప్రాణాలను పణంగా పెడుతున్నారు.

Viral Video: కదులుతున్న ట్రక్కుతో ఇద్దరు అబ్బాయిలు డేంజరస్ స్టంట్.. షాకింగ్ వీడియో వైరల్
Viral Video
Follow us on

కదులుతున్న ట్రక్కు వెనుక ఇద్దరు కుర్రాళ్లు స్కేటింగ్ స్టంట్స్ చేస్తున్న భయానక వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇందులో స్కేట్‌బోర్డ్ లు ధరించిన ఇద్దరు అబ్బాయిలు వేగంగా వెళ్తున్న ట్రక్కు వెనుక పట్టుకుని వేలాడుతున్నట్లు కనిపిస్తున్నారు. ఈ వీడియో బంగ్లాదేశ్‌లోని ఢాకాకు చెందినదని.. దీనిని బిజోయ్ సరణి మెట్రో స్టేషన్ సమీపంలో చిత్రీకరించారని పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని టీవీ9 ధృవీకరించడం లేదు

ఇద్దరు బాలురు కదులుతున్న ట్రక్కుకు ఇరువైపులా పట్టుకుని వెళ్తున్న వీడియో వైరల్ అవుతోంది. దీని తరువాత ఒక బాలుడు ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం ప్రారంభించాడు. మరొక బాలుడు దానిని చిత్రీకరిస్తున్నాడు. సేఫ్టీ ఎక్విప్‌మెంట్ లేకుండా అబ్బాయిలిద్దరూ స్టంట్‌ చేయడం వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియోను సోషల్ సైట్‌లో షేర్ చేసి ఇలాంటి విన్యాసాలు చేస్తూ మీ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఇది పూర్తిగా బాధ్యతారాహిత్యమైన చర్య అని అంటున్నారు. అంతేకాదు ఆ పిల్లలకు ఏదైనా జరిగి ఉంటే అమాయకుడైన ట్రక్ డ్రైవర్‌పై పిల్లల కుటుంబ సభ్యులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఉండేవారని అంటున్నారు. అయితే వాస్తవానికి ఈ విషయంలో తప్పు ముమ్మాటికి పిల్లలదే అని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మన దేశంలో ప్రజల ఆలోచన ఎప్పుడు మారుతుంది?

చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు అబ్బాయిల భద్రతను విస్మరించారని విమర్శించారు. ఈ ప్రతిభను సరైన ప్లాట్‌ఫారమ్‌లో చూపించినట్లయితే.. అప్పుడు అందరూ ప్రశంసించేవారని ఒకరు వ్యాఖ్యానించారు. అయితే ఈ పిల్లలు దారి తప్పిపోయారు. కనుక వీరిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మరొకరు వీరు ప్రమాదకరమైన పని చేస్తున్నారు.. అయితే వీరిలో మంచి ప్రతిభ ఉంది. అయితే అది సరైన స్థలంలో ఉపయోగించాలి అని చెప్పారు. మరో వినియోగదారు స్పందిస్తూ ఈ అబ్బాయిలు సైన్యం, పోలీసు, ప్రత్యేక దళాలకు అవసరం.. అయితే ఇలాంటి పనులతో వీరు తమ జీవితాలను వీధుల్లో వృధా చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

 

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..