Viral News: ఆన్లైన్ లో ప్లాస్టిక్ బకెట్ ధర చూసి షాక్.. నా కిడ్నీని అమ్ముకోవాలేమో ఇది కొనాలంటే అంటూ ఫన్నీ కామెంట్స్

|

May 25, 2022 | 11:33 AM

ఈ ప్లాస్టిక్ బకెట్ ధర చూసి ఎంతోమంది అవాక్కవుతున్నారు. బాత్ రూమ్ లలో, ఇంటి అవసరాలకు వాడే ప్లాస్టిక్ బకెట్ కు ఇంత ధరను ఎలా నిర్ణయిస్తారు అంటూ కామెంట్ చేస్తారు. ఈ బకెట్ ను కొనడానికి నా కిడ్నీని అమ్ముకోవాల్సి వస్తుందేమో అంటూ కామెంట్ చేశారు..

Viral News: ఆన్లైన్ లో ప్లాస్టిక్ బకెట్ ధర చూసి షాక్.. నా కిడ్నీని అమ్ముకోవాలేమో ఇది కొనాలంటే అంటూ ఫన్నీ కామెంట్స్
Plastic Bucket
Follow us on

Viral News: ఆన్‌లైన్ షాపింగ్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన అనంతరం ప్రజలు ఇంటి నుంచే షాపింగ్ చేస్తారు. అయితే ఆన్ లైన్ లో ప్రతి ఒక్క వస్తువు వినియోగదారులకు అందుబాటులోకి వస్తారు. ఆన్లైన్ లో ఖరీదైన వస్తువులు, ఉత్పత్తులతో నిండిపోయింది. ఇటీవలి రోజుల్లో అనేక విలాసవంతమైన వస్తువులను అధిక మొత్తాలకు అమ్మడం చూస్తూనే ఉన్నాం. కానీ ఒక సాధారణ ప్లాస్టిక్ బకెట్ ఖరీదు.. మాత్రం ప్రస్తుతం ఆన్ లైన్ యూజర్లకు షాక్ ఇస్తోంది.  ఒక బకెట్‌కు ఇంత అధిక ధర ఉంటుందని ఎవరూ ఎప్పుడూ ఊహించి ఉండరు. అవును, ఒక ట్విట్టర్ యూజర్ ఇటీవల అమెజాన్‌లో పింక్ ప్లాస్టిక్ బకెట్‌ను చూశారు. ఈ బకెట్ ధర రూ.25,999. అయితే అసలు ధర 35,900తో 28 శాతం తగ్గింపుతో రూ.25,999 లకు అమ్మకానికి పెట్టారు. ఈఎంఐ ఆప్షన్ కూడా ఇచ్చారు. అయితే మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ బకెట్ స్టాక్‌లో లేదు. ఇంత ఖరీదైన బకెట్‌ను ఎవరు ఇష్టపడతారో అంటూ ఆశ్చర్యపడుతున్నారు.

ఈ ప్లాస్టిక్ బకెట్ ధర చూసి ఎంతోమంది అవాక్కవుతున్నారు. బాత్ రూమ్ లలో, ఇంటి అవసరాలకు వాడే ప్లాస్టిక్ బకెట్ కు ఇంత ధరను ఎలా నిర్ణయిస్తారు అంటూ కామెంట్ చేస్తారు. ఆ బకెట్ ధరేంటి ?మళ్ళీ ఆ బకెట్ ను డిస్కౌంట్ లో కొనుగోలు చేసుకోవాలా ? పైగా స్టాక్ అయిపొయింది.. బకెట్ ఒక్కటిమాత్రమే ఉందట అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తూ నవ్వుకుంటున్నారు. ప్రస్తుతం ఈ బకెట్ కు సంబంధించిన ధమాకా ధర పై ట్విటర్ లోనూ వాడివేడి చర్చ నడుస్తోంది.

ఆ ప్లాస్టిక్ బకెట్ స్క్రీన్ షాట్ తో చాలా మంది పోస్ట్ లు చేశారు. ఈ బకెట్ తో పాటు బాత్ రూమ్ ను కూడా కాంప్లిమెంటరీగా ఇస్తారేమో అని ఒకరు కామెంట్ చేస్తే..  ‘ఈ బకెట్ నీళ్లను లిక్కర్ గా మారుస్తుందేమో’ అని మరొకరు వ్యాఖ్యానించాడు. ఇంకొకరు.. ఈ బకెట్ ను కొనడానికి కిడ్నీలను అమ్ముకోవాల్సి వస్తుందేమో అంటూ కామెంట్ చేశారు..

 

 

మరిన్నిట్రెండింగ్  వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..