మాజీ ప్రేమికుల కోసం స్పెషల్ లవ్ మార్కెట్.. ఏడాదికోసారి కలుసుకునే విచిత్ర సంప్రదాయం..!

ప్రేమ, పెళ్లి, బంధాల గురించి ప్రపంచవ్యాప్తంగా రకరకాల ఆచారాలు ఉంటాయి. కానీ, పెళ్లయిన తర్వాత లేదా విడిపోయిన తర్వాత పాత ప్రేమికులు మళ్లీ ఒకచోట కలవడం సాధారణంగా వివాదాలకు దారితీస్తుంది. అయితే వియత్నాంలో మాత్రం దీనికోసం ఒక ప్రత్యేకమైన సాంప్రదాయ వేడుకనే నిర్వహిస్తారు. అదే ఖామ్ ఖౌ లవ్ మార్కెట్‌. అసలేంటి ఈ లవ్‌ మార్కెట్‌.. ఇక్కడ ఎలాంటి సంబరాలు నిర్వహిస్తారు.. పూర్తి వివరాల్లోకి వెళితే..

మాజీ ప్రేమికుల కోసం స్పెషల్ లవ్ మార్కెట్.. ఏడాదికోసారి కలుసుకునే విచిత్ర సంప్రదాయం..!
Khau Vai Love Market

Updated on: Aug 19, 2026 | 9:06 PM

వియత్నాంలోని కొండ ప్రాంతాలలో ఖామ్ ఖౌ లవ్ మార్కెట్ పేరుతో ఒక విచిత్రమైన సాంప్రదాయ ఉత్సవం జరుగుతుంది. ఏటా జరిగే ఈ మార్కెట్‌కు ఒకనాటి పాత ప్రేమికులు, బ్రేకప్ అయిన జంటలు లేదా పెళ్లయి విడిపోయినవారు ఒకచోటకు చేరుకుంటారు. విధి వశాత్తూ పెళ్లిపీటల వరకు వెళ్లలేకపోయిన మాజీ ప్రేమికులు, ఇక్కడ కలుసుకుని తమ పాత జ్ఞాపకాలను పంచుకుంటారు. ప్రస్తుత భాగస్వాముల సమ్మతితోనే ఈ కలయిక జరగడం దీని ప్రత్యేకత. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా, ఒకరినొకరు గౌరవించుకుంటూ సాగే ఈ వినూత్న పండుగ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.

వియత్నాంలోని హా గ్యాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న కొండ ప్రాంతంలో ప్రతి సంవత్సరం చంద్రమాస క్యాలెండర్ ప్రకారం మూడో నెలలోని 27వ రోజున ఈ లవ్ మార్కెట్ జరుగుతుంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వేడుకకు దేశం నలుమూలల నుంచి మాజీ ప్రేమికులు తరలివస్తారు. అనివార్య కారణాల వల్ల విడిపోయి, వేర్వేరు వ్యక్తులను పెళ్లి చేసుకున్న ఒకనాటి ప్రేమికులు ఇక్కడ కలుసుకుంటారు.

ఈ ఉత్సవంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. భార్యాభర్తలు ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే ఇక్కడికి వస్తారు. ఒకరి భాగస్వామి తమ మాజీ ప్రేమికుడిని లేదా ప్రేమికురాలిని కలవడానికి వెళ్లినప్పుడు, మరొకరు ఎలాంటి ఈర్ష్య లేదా అభ్యంతరం వ్యక్తం చేయరు. ఒకరోజు పాటూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికి, ఒకరి సంక్షేమాన్ని మరొకరు అడిగి తెలుసుకోవడానికి ఇక్కడ పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఈ కలయిక కేవలం ఒకరినొకరు పలకరించుకోవడం, జ్ఞాపకాలను పంచుకోవడానికి మాత్రమే పరిమితం. ఎలాంటి అవాంఛనీయ లేదా అనైతిక పనులకు ఇక్కడ తావుండదు.

ఇవి కూడా చదవండి

స్థానిక కథనాల ప్రకారం.. పూర్వం వేర్వేరు తెగలకు చెందిన ఒక యువకుడు, యువతి తీవ్రంగా ప్రేమించుకున్నారు. కానీ, వారి కుటుంబాల మధ్య ఉన్న శత్రుత్వం వల్ల వారి పెళ్లి జరగలేదు. దీంతో వారు తమ ప్రేమను త్యాగం చేసి, గ్రామాల మధ్య శాంతి కోసం విడిపోయారు. అయితే, ఏటా ఒక నిర్దిష్ట రోజున మాత్రం కలుసుకోవాలని భాస చేసుకున్నారు. వారి త్యాగానికి గుర్తుగానే ఈ లవ్ మార్కెట్ సాంప్రదాయం ప్రారంభమైంది. నేటి ఆధునిక కాలంలో కూడా ఈ పురాతన ఆచారం చెక్కుచెదరకుండా కొనసాగుతూ, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us