Viral Video: వావ్..రోటీతో మ్యాగీ.. ఇలా కూడా తయారు చేయవచ్చా..!

|

Oct 07, 2024 | 6:42 PM

రోటీ మ్యాగీ.. ఈ పేరు విన్నవారికి కాస్త కొత్తగా అనిపిస్తుంది. మనం మ్యాగీతో ఎన్నో కాంబినేషన్‌లు తిని ఉంటాం.. వివిధ వెరైటీలను కూడా రుచి చూసి ఉంటాం. కాన్నీ మార్కెట్‌లోకి కొత్తగా ఇప్పుడు రోటీ మ్యాగీ అని వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వారు రోటీ మ్యాగీ మేకింగ్ వీడియో వైరల్‌గా మారింది.

Viral Video: వావ్..రోటీతో మ్యాగీ.. ఇలా కూడా తయారు చేయవచ్చా..!
Roti Magi Video Goes Viral
Follow us on

రోటీ మ్యాగీ.. ఈ పేరు విన్నవారికి కాస్త కొత్తగా అనిపిస్తుంది. మనం మ్యాగీతో ఎన్నో కాంబినేషన్‌లు తిని ఉంటాం.. వివిధ వెరైటీలను కూడా రుచి చూసి ఉంటాం. కాన్నీ మార్కెట్‌లోకి కొత్తగా ఇప్పుడు రోటీ మ్యాగీ అని వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో రోటీ మ్యాగీ మేకింగ్ వీడియో వైరల్‌గా మారింది.  మాక్ సింగ్ అనే డైటీషియన్ మిగిలిపోయిన రోటీలను తీసుకొని వాటిని కత్తెరతో నూడిల్ లాంటి స్ట్రిప్స్‌గా కత్తిరించడంతో వీడియో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత స్టవ్ మీద ఒక లోహపు కుండను వేడి చేసి నూనెతో తేలికగా స్ప్రే చేస్తాడు. తరువాత, అతను పాన్‌లో ముక్కలు చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మరియు టొమాటో పురీని కలుపుతాడు. అనంతరం ఉప్పు, పసుపు పొడి మరియు ఎర్ర కారం పొడి వంటి మసాలా దినుసులను కలుపుతాడు. ఆ తర్వాత సాస్‌తో పూర్తిగా కలుపుతాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మ్యాగీ నూడుల్స్ కంటే ఈ వంటకం ఖచ్చితంగా ఆరోగ్యకరమైందని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. అయినప్పటికీ, ఈ వంటకం దాని తయారీలో ఏ మ్యాగీ ప్రమేయం లేనందున దీనిని “రోటీ మ్యాగీ” అని పిలవవచ్చు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. “మ్యాగీ లేకుండా మ్యాగీ” అని మరోకరు సైటర్లు వేస్తున్నారు. ఇంకొకరు, “ఇది కేవలం రోటీ కాదు? మేము చిన్నప్పటి నుంచి దీన్ని తయారుచేస్తున్నట్లు పేర్కొ్న్నారు. “వావ్, గ్రేట్! తాము కూడా ఇలాంటివి వండుకున్నామని, కానీ ఇది కొంచెం భిన్నంగా ఉంది అని మరోక వ్యక్తి కామెంట్ చేశాడు.

రోటీ మ్యాగీ మేకింగ్ వీడియో ఇదిగో:

ఇలాంటి ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి