AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: చావు అంచుల్లో ఉన్న బిడ్డ కోసం ప్రాణాలకు తెగించింది.. తల్లి ఏనుగు ప్రేమకు హ్యాట్సాఫ్!

ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్ కార్బెట్ ల్యాండ్‌స్కేప్ పరిధిలో చోటుచేసుకున్న ఓ అరుదైన వన్యప్రాణి దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోసి నదిలో వేగంగా ప్రవహిస్తున్న నీటిలో కొట్టుకుపోతున్న తన పిల్ల ఏనుగును కాపాడేందుకు తల్లి ఏనుగు నదిలోకి దూకి, తొండంతో దానికి ఆసరాగా నిలిచిన దృశ్యం నెటిజన్లను భావోద్వేగానికి గురిచేస్తోంది.

Watch: చావు అంచుల్లో ఉన్న బిడ్డ కోసం ప్రాణాలకు తెగించింది.. తల్లి ఏనుగు ప్రేమకు హ్యాట్సాఫ్!
Mother Elephant Rescues
Balaraju Goud
|

Updated on: Sep 19, 2026 | 6:26 PM

Share

ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్ కార్బెట్ ల్యాండ్‌స్కేప్ పరిధిలో చోటుచేసుకున్న ఓ అరుదైన వన్యప్రాణి దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోసి నదిలో వేగంగా ప్రవహిస్తున్న నీటిలో కొట్టుకుపోతున్న తన పిల్ల ఏనుగును కాపాడేందుకు తల్లి ఏనుగు నదిలోకి దూకి, తొండంతో దానికి ఆసరాగా నిలిచిన దృశ్యం నెటిజన్లను భావోద్వేగానికి గురిచేస్తోంది.

రామ్‌నగర్‌లోని రింగాడా ప్రాంతంలో ఏనుగుల గుంపు కోసి నదిని దాటుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గుంపులోని మూడు పిల్ల ఏనుగుల్లో రెండు కొంత పెద్దగా ఉండటంతో సురక్షితంగా నదిని దాటాయి. అయితే మూడో పిల్ల ఏనుగు అప్పుడే పుట్టినంత చిన్నదిగా ఉండటంతో బలమైన నీటి ప్రవాహాన్ని తట్టుకోలేక కొట్టుకుపోయింది. దాని వయస్సు నెలలోపే ఉంటుందని వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ దీప్ రాజ్వార్ తెలిపారు.

తొండం పైకెత్తి తల్లికి సంకేతం

ప్రవాహంలో కొట్టుకుపోతున్న సమయంలో పిల్ల ఏనుగు తన తొండాన్ని పైకెత్తి తల్లికి సంకేతం ఇచ్చింది. ప్రమాదాన్ని గుర్తించిన తల్లి ఏనుగు వెంటనే నదిలోకి దూకింది. వేగంగా ప్రవహిస్తున్న నీటిలో ఈదుకుంటూ వెళ్లి, తన తొండంతో పిల్లను పట్టుకుని ప్రవాహం నుంచి బయటకు తీసుకొచ్చింది. అనంతరం దానిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. ఈ మొత్తం దృశ్యాన్ని అక్కడున్న ఓ పర్యాటకుడు మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించగా, వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ దీప్ రాజ్వార్ కూడా ఈ అరుదైన క్షణాలను కెమెరాలో బంధించారు. తల్లి ఏనుగు స్పందించిన తీరు తనను ఎంతో ఆకట్టుకుందని ఆయన తెలిపారు.

ఏనుగుల సామాజిక బంధానికి నిదర్శనం

కార్బెట్ టైగర్ రిజర్వ్ డైరెక్టర్ డాక్టర్ సాకేత్ బడోలా ప్రకారం.. ఏనుగులు బలమైన సామాజిక బంధాలు, మాతృత్వానికి ప్రసిద్ధి చెందాయి. సాధారణంగా ఆడ ఏనుగులు గుంపులకు నాయకత్వం వహిస్తాయి. పిల్లలను కాపాడటంలో తల్లితో పాటు గుంపులోని ఇతర ఆడ ఏనుగులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కోసి నదిలో జరిగిన ఈ ఘటన వన్యప్రాణుల్లో తల్లి-బిడ్డల మధ్య ఉండే బలమైన అనుబంధాన్ని మరోసారి కళ్లకు కట్టినట్లు చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతూ, తల్లి ఏనుగు చూపిన ప్రేమ, ధైర్యంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us