AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: రిస్క్‌తో కూడిన రీల్స్ చేయబోతే సీన్ రివర్స్.. చివరికిలా అర్థనగ్నంగా..!

హమీర్‌పూర్‌లో రీల్స్ మోజులో యువకులు ప్రాణాలకు తెగించి లోతైన నీటిలో విన్యాసాలు చేయగా, పోలీసులు వారిని పట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో లైకుల కోసం ప్రమాదకర చర్యలకు పాల్పడటం తగదని హెచ్చరించారు. లోదుస్తులతో 'కప్ప గెంతులు' చేయించి, భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయకూడదని గట్టిగా సూచించారు. ప్రాణాలు విలువైనవని, వాటిని ప్రమాదంలోకి నెట్టవద్దని పోలీసులు ఉద్బోధించారు.

Viral: రిస్క్‌తో కూడిన రీల్స్ చేయబోతే సీన్ రివర్స్.. చివరికిలా అర్థనగ్నంగా..!
Dangerous Stunts Police Action
Balaraju Goud
|

Updated on: Sep 14, 2026 | 4:12 PM

Share

హమీర్‌పూర్: సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలకు లైక్స్‌, వ్యూస్‌ కోసం కొందరు యువత ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ప్రమాదకర ప్రదేశాల్లో విన్యాసాలు చేస్తూ వీడియోలు తీసుకోవడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. లోతైన నీటిలో ప్రమాదకరంగా ఈత కొడుతూ, విన్యాసాలు చేస్తున్న కొందరు యువకులకు పోలీసులు వినూత్న రీతిలో గుణపాఠం చెప్పారు.

మౌదాహా ప్రాంతంలోని కమ్హరియా బంధ్‌లో నీటిమట్టం ప్రస్తుతం చాలా లోతుగా ఉన్నట్లు సమాచారం. అయినప్పటికీ కొందరు యువకులు ప్రమాదాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా నీటిలోకి దిగారు. రీల్స్‌ కోసం నీటిలో దూకడం, ఈత కొట్టడం, విన్యాసాలు చేయడం వంటి వాటిని వీడియోగా చిత్రీకరిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. లోతైన నీటిలో ఉన్న యువకులను బయటకు తీసుకొచ్చి, వారి చర్యలపై తీవ్రంగా హెచ్చరించారు. కేవలం కొన్ని సెకన్ల వీడియో కోసం ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవడం సరికాదని వారికి పోలీసులు సూచించారు.

కప్ప గెంతులు వేయించిన పోలీసులు

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో యువకులు కేవలం లోదుస్తులు ధరించి ‘కప్ప గెంతులు’ వేస్తూ కనిపిస్తున్నారు. పోలీసులు వారితో ఈ వ్యాయామం చేయించినట్లు తెలుస్తోంది. అనంతరం ఇకపై ఇలాంటి ప్రమాదకర చర్యలకు పాల్పడవద్దని గట్టిగా హెచ్చరించారు. లోతైన నీటిలో ఈత కొట్టడం, రక్షణ పరికరాలు లేకుండా విన్యాసాలు చేయడం ఎప్పుడైనా ప్రాణాంతకంగా మారొచ్చని పోలీసులు వివరించారు. నీటి ప్రవాహం, లోతు, అకస్మాత్తుగా వచ్చే గుంతలు వంటి అంశాలను అంచనా వేయకుండా నీటిలోకి దిగడం ప్రమాదకరమని తెలిపారు.

మౌదాహా పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జ్‌ సంతోష్‌ సింగ్‌ మాట్లాడుతూ.. యువకులను హెచ్చరించి అక్కడి నుంచి పంపించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్య చర్యలు పునరావృతమైతే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన పోలీసుల చర్యల వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us