Cock birthday celebration: ‘కోడి పుంజు’కు గ్రాండ్‌గా బర్త్ డే సెలబ్రేషన్స్.. ఇదే ఫస్ట్ టైమ్

|

Sep 26, 2021 | 3:58 PM

మనుషుల బర్త్ డే వేడుకలు రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటాం. ఇక ఇష్టంగా పెంచుకునే పెట్స్( శునకాలు, పిల్లులు, ఇతర జీవులు) బర్త్ డే వేడుకలు కూడా గ్రాండ్‌గా చేసిన సందర్భాలు ఉన్నాయి. 

Cock birthday celebration: కోడి పుంజుకు గ్రాండ్‌గా బర్త్ డే సెలబ్రేషన్స్.. ఇదే ఫస్ట్ టైమ్
Cock Birhday
Follow us on

మనుషుల బర్త్ డే వేడుకలు రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటాం. ఇక ఇష్టంగా పెంచుకునే పెట్స్( శునకాలు, పిల్లులు, ఇతర జీవులు) బర్త్ డే వేడుకలు కూడా గ్రాండ్‌గా చేసిన సందర్భాలు ఉన్నాయి.  అయితే కోడికి పుట్టిన రోజు చేయడం ఎక్కడైనా చూశారా.. ఎట్‌లీస్ట్ విన్నారా. లేదు కదా. ఇదేదో వింతగా ఉంది కదా. అవును.. నిజమేనండీ.. మహారాష్ట్రకు చెందిన ఓ కుటుంబం ఓ కోడి పుంజుకు తొలి పుట్టినరోజు జరిపి వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి వెళ్తే.. నాగ్​పుర్​ జిల్లా ఉమ్రేడ్​ తాలూకాలోని మంగళ్​వార్​ పేఠ్​కు చెందిన ఉమాకాంత్​ కాగ్దేల్వార్​కు సంవత్సరం క్రితం ఓ కోడిపిల్ల ​దొరికింది. ఆ కొడిపిల్ల పౌల్ట్రీ వ్యాన్​ నుంచి జారి, అతని షాపు ముందు పడింది. అప్పటి నుంచి దానిని కోడిలా కాకుండా.. తమ కుటుంబంలో ఓ మెంబర్‌లా భావించి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఆ ప్యామిలీ అంతా దీనిని ‘కుచాశేత్’ అని పిలుస్తుంది.

పుత్ర సంతానం లేని ఉమాకాంత్.. ఆ కోడిని సన్‌లాగే భావిస్తున్నారు. అతని కుమార్తె సురభి కూడా కుచాశేత్​​ను తమ్ముడిలా భావించి.. దాని ఆలనాపాలనా చూసుకుంటోంది. కుచాశేత్​​కు ఈ నెల 20 తేదీకి ఏడాది కంప్లీట్ అయ్యింది. దీంతో ఆ కోడికి సంప్రదాయ పద్ధతిలో ఫస్ట్ బర్త్ డే చేశారు. తమ ఇంటిని అలంకరించారు. ఆ కోడి ఇష్టమైన జీడీపప్పు, వేరుశెనగ, శ్రీఖండ్ వంటి​ ఆహార పదార్థాలను తినిపించారు. కోడి బర్త్​డే సెలబ్రేషన్స్​కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్​ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు.. ‘కోడికి పుట్టిన రోజు ఏంటో’.. అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఆ ఫ్యామిలీ గ్రేట్ అంటూ ప్రశంసిస్తున్నారు.

Also Read: షాపింగ్ పూర్తి చేసుకుని 10 నిమిషాల్లో వచ్చి చూస్తే షాక్.. జీప్‌లో భారీ గూడు కట్టిన తేనెటీగలు

తుఫాను వేళ ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కీలక హెచ్చరికలు.. చేయాల్సినవి, చేయకూడనివి