Photo Puzzle: మీ ఐ ఫోకస్ ఏ రేంజ్ ఏంటి.? ఈ ఫోటోలో దాగున్న 4657 నెంబర్‌ను 5 సెకన్లలో కనిపెట్టగలరా.!

|

Jul 31, 2024 | 6:30 PM

డైలీ సోషల్ మీడియాలో వందల కొద్దీ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు తెగ వైరల్ అవుతుంటాయి. అర్ధం కాలేదా.? ఆప్టికల్ ఇల్యూషన్ అదేనండీ ఫోటో పజిల్స్.. ఇవి నెటిజన్లను ఈ మధ్యకాలంలో విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మీ మైండ్ యాక్టివ్ అవ్వడమే కాదు..

Photo Puzzle: మీ ఐ ఫోకస్ ఏ రేంజ్ ఏంటి.? ఈ ఫోటోలో దాగున్న 4657 నెంబర్‌ను 5 సెకన్లలో కనిపెట్టగలరా.!
Photo Puzzle
Follow us on

డైలీ సోషల్ మీడియాలో వందల కొద్దీ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు తెగ వైరల్ అవుతుంటాయి. అర్ధం కాలేదా.? ఆప్టికల్ ఇల్యూషన్ అదేనండీ ఫోటో పజిల్స్.. ఇవి నెటిజన్లను ఈ మధ్యకాలంలో విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మీ మైండ్ యాక్టివ్ అవ్వడమే కాదు.. మీలో చురుకుదనాన్ని కూడా తీసుకొస్తాయి ఈ ఫోటో పజిల్స్. తాజాగా మీ ఐ ఫోకస్ ఏ రేంజో తెలుసుకునేందుకు ఓ ఖతర్నాక్ పజిల్ మీ ముందుకు తీసుకొచ్చాం. ఇది ఒక రకమైన టాస్క్ అనే అనుకోండి. మీరు ఓ సమస్యను చూసే దృష్టికోణం.. దాన్ని ఎలా సాల్వ్ చేయగలరో చెప్పేస్తుంది.. సరిగ్గా ఇది కూడా అంతే.!

ఇది చదవండి: బాంబ్ పేల్చిన RCB.. మెగా వేలానికి ముందే కోహ్లీ క్లోజ్ ఫ్రెండ్‌కు హ్యాండిచ్చారుగా

పైన పేర్కొన్న ఫోటోను గమనించారా..! మీకు ఎటు చూసినా 4567 నెంబర్ కనిపిస్తోంది కదూ.. అవును.! అక్కడున్నది ఆ నెంబర్ సిరీస్ మాత్రమే అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అందులో వేరే నెంబర్ కూడా ఒకటి ఉంది. అదేంటో కనుక్కోగలిగితే మీరే తోపు.. మీకున్నది కేవలం 5 సెకన్లు మాత్రమే. ఆలోపు కనిపెడితే మీ ఐ పవర్ అదుర్స్ అని ఒప్పుకోవాల్సిందే. మీరు ఎక్కువ టైం తీసుకుంటే మాత్రం.. పరధ్యానంగా ఉన్నట్లే లెక్క.

ఏంటి.? కనిపెట్టారా.! అయితే మీరు కేక బాసూ.. ఒకవేళ ఇప్పటికీ గుర్తించలేకపోతే ఆగండి.! ఆ నెంబర్ ఎక్కడుందో కింద ఫోటోలో ఇచ్చేస్తున్నాం. మీరూ చూసేయండి. నెక్స్ట్ టైం మరో అదిరిపోయే పజిల్‌తో కలుద్దాం. అంతవరకూ టాటా.. బైబై.. ఆదాబ్.. నమస్తే..

ఇది చదవండి: కునుకేశారో దెయ్యానికి దొరికిపోతారు.! సీన్ సీన్‌కు సుస్సుపడాల్సిందే.. మూవీ ఏ ఓటీటీలో చూడొచ్చునంటే