AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beer: మార్కెట్‌లోకి కొత్త బీర్.. యూత్‌ ఫేవరెట్‌గా మారిన ఈ డ్రింక్ గురించి మీకు తెలుసా?

ప్రస్తుతం మార్కెట్‌లో కొత్త రకమైన బీర్ తెగ వైరల్‌ అవుతోంది అదే రైస్ బీర్.. సాంకేతిక యుగంలో పుట్టిన జెన్-జీ కిడ్స్ దీని టేస్ట్‌కు పిచ్చ ఫ్యాన్ అయిపోతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ దుఖానాల్లో దీనికి ఫుల్‌ క్రేజ్ ఉందట. పాత సంప్రదాయాలకు కొత్త మెరుగులు దిద్దుతూ ఈ పురాతన పానీయాన్ని ట్రెండ్‌లోకి తెస్తున్నారు జెన్-జీస్. ఇంతకూ దీని ప్రయోజనాలేంటి, దీన్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం పదండి.

Beer: మార్కెట్‌లోకి కొత్త బీర్.. యూత్‌ ఫేవరెట్‌గా మారిన ఈ డ్రింక్ గురించి మీకు తెలుసా?
Gen Z Favorite Drinks
Anand T
|

Updated on: Apr 09, 2026 | 12:33 PM

Share

సాంకేతిక యుగంలో పుట్టిన జెన్-జెడ్ తరం కొత్త ట్రెండ్‌లను సృష్టిస్తోంది. తమదైన ఆధునిక పద్ధతులతో అత్యంత పురాతన సామాజిక ఆచారాలలో ఒకటైన్ రైస్‌ బీర్‌కు పునరుజ్జీవం పోస్తోంది. సాధారణంగా జెన్-జీ యువత మద్యం సేవించడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అందుకే వారు రసాయనాలు లేని, సహజ సిద్ధమైన ప్రత్యామ్నాయాల వైపు వెళ్తున్నారని పేర్కొంది. ఈ క్రమంలో ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఫేమస్ అయిన రైస్ బీర్ తాగేందుకు యువత ఫుల్‌ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ రైస్ బీర్ దేశవ్యాప్తంగా, ముఖ్యంగా నగరాల్లోని కెఫేలలో హాట్ కేక్‌లా అమ్మడవుతోందట

ఈ రైస్ ఇప్పుడు కొత్తగా వచ్చిందేమి కాదు. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ వంటి స్టేట్‌లలో కొన్ని శతాబ్దాలుగా ఈ రైస్‌ బీర్‌ను ప్రజలు తాగుతున్నారు. దానికున్న అమోగమైన రుచి, సోషల్ మీడియా ప్రభావంతో ఇప్పుడు ఇది దేశ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాలలోనూ బాగా ప్రాచుర్యం పొందుతోంది. .

రైస్ ఎలా తయారు చేస్తారు?

ఈ రైస్ బీర్ గిరిజన సంస్కృతి నుండి ఉద్భవించింది. సహజమైన ఈస్ట్‌ను కలిగి ఉన్న మూలికలతో తయారు చేసిన స్టార్టర్ కల్చర్‌తో బియ్యాన్ని పులియబెట్టి ఈ రైస్ బీర్‌ను తయారు చేస్తారు. తొలుత వండిన అన్నాన్ని చల్లార్చి, మట్టి పాత్రలు లేదా వెదురు పాత్రల్లో భద్రపరుస్తారు. తర్వాత సహజ సిద్ధమైన ఈస్ట్ కలిగిన మూలికలను దీనిలో కలుపుతారు. సంప్రదాయబద్ధంగా చేసే రైస్ బీర్‌లో దాదాపు 20 రకాల అడవి మూలికలను ఉపయోగిస్తారు.ఈ ప్రక్రియ ద్వారా తయారయ్యే పానీయంలో సాధారణంగా 5 నుండి 10 శాతం వరకు ఆల్కహాల్ ఉంటుంది. అయితే నగరాల్లోని కెఫేలలో రుచి కోసం కొన్ని మార్పులు చేస్తున్నారు.

ఆరోగ్యానికి మంచిదేనా?

చాలామంది రైస్ బీర్ ఆరోగ్యకరమైనదని భావిస్తారు. కానీ అయితే నిపుణులు మాత్రం దీని విషయంలో కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నిపుణురాలు ప్రకారం, ఇది పులియబెట్టిన పానీయం కాబట్టి, పరిమితంగా తీసుకుంటే జీర్ణక్రియకు కొంత వరకు సహాయపడుతుంది. కానీ అతిగా సేవించడం వల్ల కాలేయం పాడవ్వడం, గుండె సమస్యలు, మానసిక స్పష్టత తగ్గడం వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో తాగిన వెంటనే డీహైడ్రేషన్, వికారం వంటి సమస్యలు కూడా కనిపించవచ్చని చెబుతున్నారు.

చట్టపరమైన చిక్కులు

రైస్ బీర్ అనేది ప్రస్తుత మద్యం నిబంధనల ప్రకారం ఏ వర్గంలోకి వస్తుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఢిల్లీ వంటి నగరాల్లోని కొన్ని కెఫేలు లిక్కర్ లైసెన్స్ లేకుండానే దీన్ని విక్రయిస్తున్నాయి. కానీ భారతీయ చట్టాల ప్రకారం, పానీయంలో ఉండే ఆల్కహాల్ శాతం ఆధారంగానే దాన్ని వర్గీకరించాల్సి ఉంటుంది. మరో ముఖ్య విషయం ఏపానియమైనా ఎక్కువగా తాగితే ప్రమాదకరమే. ఆరోగ్యపరంగా ప్రయోగాలు చేసే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవడం, వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించడం లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో