Viral Video: ఇది కదా మానవత్వం అంటే..? ట్రాఫిక్ పోలీస్‌కు సెల్యూట్ చేస్తున్న నెటిజనం..

|

Apr 04, 2022 | 12:31 PM

Monkey Viral Video: ఎండలు దంచి కొడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. పెరుగుతున్న ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కూలర్-ఏసీ లాంటివి లేకుండా ఇళ్లల్లోనే ఉండలేకపోతున్నారు.

Viral Video: ఇది కదా మానవత్వం అంటే..? ట్రాఫిక్ పోలీస్‌కు సెల్యూట్ చేస్తున్న నెటిజనం..
Viral Video
Follow us on

Monkey Viral Video: ఎండలు దంచి కొడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. పెరుగుతున్న ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కూలర్-ఏసీ లాంటివి లేకుండా ఇళ్లల్లోనే ఉండలేకపోతున్నారు. నగరాలతోపాటు గ్రామాల్లో కూడా ఇదే కనిపిస్తోంది. ఏప్రిల్‌లోనే ఎండలు ఇలా ఉన్నాయంటే.. మే, జూన్‌లో ఇంకా ఎలా ఉంటాయోనన్న ఆందోళన నెలకొంది. సాధారణంగా మనకు దాహం వేస్తే నీళ్లు తాగుతాం.. కానీ ఒక్కసారి మూగజీవాల గురించి ఆలోచించండి. వాటికి నీరు కనిపిస్తేనే తాగుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మూగ జీవాలు అల్లాడుతున్నాయి. అయితే.. తాజాగా దాహంతో అల్లాడుతున్న వానరానికి ఓ పోలీస్ సాయం చేశాడు. వాటర్ బాటిల్‌తో కోతికి నీరు అందించాడు. ట్రాఫిక్ పోలీస్ కోతికి నీళ్లు తాపిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా (social media) లో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రజల హృదయాలను గెలుచుకుంటోంది.

వైరల్ వీడియోలో.. ఓ ట్రాఫిక్ పోలీస్ కోతికి నీళ్లు తాపిస్తున్న దృశ్యాన్ని చూడవచ్చు. అదే సమయంలో.. కొంతమంది ఈ అందమైన దృశ్యాన్ని చూస్తుండగా.. ఎవరో వ్యక్తి తన కెమెరాలో బంధించాడు. చిన్న పట్టణాలు లేదా గ్రామాలలో అయితే జంతువులకు నీరు లభిస్తుంది. కానీ.. కొండ ప్రాంతాల్లో నివసించే జంతువులు నీటి కోసం అల్లాడుతుంటాయి. పాపం.. ఆ కోతి చాలా దాహంతో ఉందని.. నీరు తాగే విధానం చూస్తే అర్ధమవుతుందని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మానుష్య ప్రాంతాల్లో జంతువుల కోసం వీలైతే నీటి తొట్టెలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు జంతు ప్రేమికులు.

వైరల్ వీడియో.. 

ఈ అద్భుతమైన వీడియోని ప్రజలు బాగా ఇష్టపడుతున్నారు. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవ్నీష్ శరణ్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పంచుకున్నారు. ట్రాఫిక్ పోలీసు పేరు సంజయ్ ఘుడే అంటూ ట్విట్ చేశారు. కేవలం 30 సెకన్ల ఈ వీడియోకు ఇప్పటివరకు 1 లక్షా 71 వేలకు పైగా వీక్షించగా.. 14 వేల మందికి పైగా లైక్ చేశారు. దీంతోపాటు ట్రాఫిక్ పోలీసు మానవత్వానికి సెల్యూట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Watch Video: బోర్ కొడుతుందని చేపలు పట్టేందుకు వెళ్లాడు.. చివరకు ఊహించని షాక్.. వీడియో వైరల్

Kidney Stones: కిడ్నీల్లో రాళ్ల సమస్య వేధిస్తుందా..? ఈ మూడు రసాలతో చెక్ పెట్టవచ్చు..

Ramadan 2022: సెహ్రీ, ఇఫ్తార్‌ విందులో ఖర్జూరాలు తప్పనిసరిగా తింటారు? ఎందుకో తెలుసా..