Viral Video: టూత్‌పేస్ట్‌ కాఫీ ఎప్పుడైనా తాగారా..! ఎలా తయారుచేశాడో చూస్తే పరేషాన్..

Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజు కామెడీకి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతుంటాయి. నెటిజన్లు వీటిని పదే పదే చూస్తూ నవ్వుకుంటారు. ఇటీవల కొందరు హైలెట్‌

Viral Video: టూత్‌పేస్ట్‌ కాఫీ ఎప్పుడైనా తాగారా..! ఎలా తయారుచేశాడో చూస్తే పరేషాన్..
Toothpaste Coffee

Updated on: Oct 27, 2021 | 2:04 PM

Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజు కామెడీకి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతుంటాయి. నెటిజన్లు వీటిని పదే పదే చూస్తూ నవ్వుకుంటారు. ఇటీవల కొందరు హైలెట్‌ కావడానికి వింత వింత ఫుడ్ తయారు చేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ వైరల్‌గా మారుతున్నారు. గత కొన్ని రోజుల క్రితం దోసెల రెసిపీని చూసి ఉలిక్కిపడ్డ జనాలు తాజాగా టూత్‌పేస్ట్ కాఫీని చూసి పరేషాన్ అవుతున్నారు. ఇలాంటి కాఫీని చూసి నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

వీడియోల ఓ వ్యక్తి టూత్‌పేస్ట్‌తో కాఫీ తయారు చేయడం మనం చూడవచ్చు. ఆ వ్యక్తి మొదటగా టూత్‌పేస్ట్‌ని మిక్సీలో వేసి ద్రవ పదార్థంలా చేస్తాడు. తర్వాత దీనిని పాలతో కలుపుతాడు. అనంతరం ఈ మిశ్రమానికి కాఫీ జోడిస్తాడు. అనంతరం వాటిలో కొన్ని పిప్పరమింట్ బిళ్లలను కలుపుతాడు. చివరగా గ్లాసులో పోసుకొని తాగడం మనం గమనించవచ్చు. అంతేకాదు ఈ టూత్‌పేస్ట్ కాఫీ చాలా రుచిగా ఉందని బదులిస్తాడు. అయితే ఆ వ్యక్తి రియాక్షన్ చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు.

చాలామంది ఈ విచిత్రమైన కాఫీని చూసి పరేషాన్ అయ్యారు. కొంతమంది వాంతులు వస్తున్నాయని కామెంట్ చేశారు. మరికొంతమంది కాఫీ ప్రియులు ఇదేం కాఫీ నాయనా అంటూ కామెంట్‌ చేశారు. ఈ విచిత్రమైన కాఫీ వీడియో whathowtry పేరుతో Instagramలో షేర్‌ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 19 వేల మందికి పైగా లైక్ చేశారు. చాలా మంది ఈ కాఫీని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేయడం విశేషం.

Airtel, Jio, Vi 100లోపు రీఛార్జ్ ప్లాన్‌లు.. కాల్స్‌, డేటా ప్రయోజనాలు తెలుసుకోండి..

Skin Care: సాఫ్ట్ స్కిన్ కోసం కాఫీ స్క్రబ్‌.. ఇంట్లోనే తయారుచేయండిలా..?

BEL Recruitment 2021: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us