ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం మన ఇండియాలోనే.. బ్యాంకుల్లో రూ.8000 కోట్ల డిపాజిట్లు!

గ్రామం అనగానే మనకు సాధారణంగా వ్యవసాయం, పెంకుటిళ్లు, మట్టి రోడ్లు, పరిమితమైన సదుపాయాలు గుర్తొస్తాయి. కానీ, భారతదేశంలోని ఒక గ్రామం మాత్రం ఈ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామంగా ఖ్యాతి గడించింది. గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలోని భుజ్ పరిధిలో ఉన్న మాధాపర్ గ్రామమే ఈ ఆర్థిక అద్భుతం. ఒక సాధారణ నగరంలో కూడా ఉండనంత బ్యాంకింగ్ నెట్‌వర్క్, వేల కోట్ల రూపాయల డిపాజిట్లు ఈ గ్రామం సొంతం.

ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం మన ఇండియాలోనే.. బ్యాంకుల్లో రూ.8000 కోట్ల డిపాజిట్లు!
India's Richest Village
Image Credit source: AI image

Updated on: Jul 10, 2026 | 12:29 PM

భారతదేశం కేవలం బిలియనీర్లకే కాదు, ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన గ్రామానికి కూడా నిలయంగా నిలిచింది. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఉన్న మాధాపర్ గ్రామం ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ గ్రామంలోని ప్రజల పేరిట స్థానిక బ్యాంకుల్లో ఏకంగా కోట్లలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. కేవలం 32,000 జనాభా ఉన్న ఈ చిన్న గ్రామంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన 17 నుండి 19 బ్యాంకుల బ్రాంచ్‌లు పనిచేస్తున్నాయి. ఇక్కడి సంపదకు ప్రధాన కారణం ఏంటో వివరంగా తెలుసుకుందాం..

గ్రామంలో 19 బ్యాంకులు – రూ.8,000 కోట్ల డిపాజిట్లు:

సుమారు 32,000 జనాభా, 7,600 గృహాలు కలిగిన ఈ చిన్న గ్రామంలో దాదాపు 17 నుండి 19 ప్రముఖ బ్యాంకుల శాఖలు SBI, HDFC, ICICI, Axis, PNB వంటివి సేవలందిస్తున్నాయి. నివేదికల ప్రకారం, ఈ గ్రామస్తుల పేరిట స్థానిక బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో ఉన్న మొత్తం ఫిక్స్‌డ్ డిపాజిట్ల విలువ రూ.7,000 నుండి రూ.8,000 కోట్ల పైమాటే. ఇక్కడి సగటు వ్యక్తిగత బ్యాంక్ డిపాజిట్ విలువ దాదాపు రూ.15 లక్షల వరకు ఉంటుంది అంటే ఈ గ్రామం ఎంత ధనవంతమైనదో అర్థం చేసుకోవచ్చు.

ఇంతటి సంపదకు రహస్యం ఏంటి?:

మాధాపర్ గ్రామం ఇంతటి ఆర్థిక శక్తిగా ఎదగడం వెనుక ఇక్కడి ఎన్‌ఆర్ఐ (NRI) ల సంఘీభావం ఉంది. ఈ గ్రామానికి చెందిన సుమారు 1,200 పైగా కుటుంబాలు లండన్, అమెరికా, కెనడా, ఆఫ్రికా, గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి, అక్కడ వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డాయి. అయితే, వారు విదేశాలలో స్థిరపడినప్పటికీ తమ మూలాలను మరిచిపోలేదు. వారు సంపాదించిన డబ్బును విదేశీ బ్యాంకుల్లో ఉంచకుండా, నేరుగా తమ స్వగ్రామంలోని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు. దీనికోసం 1968లోనే లండన్‌లో మాధాపర్ విలేజ్ అసోసియేషన్ కూడా ఏర్పాటైంది.

ఇవి కూడా చదవండి

నగరాలను తలపించే మౌలిక సదుపాయాలు:

ఈ గ్రామానికి కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే కాదు, లగ్జరీ లైఫ్‌స్టైల్ కూడా ఉంది. గ్రామంలో అద్భుతమైన విల్లాలు, పెద్ద పెద్ద బంగళాలు, కాంక్రీట్ రోడ్లు, ఆధునిక పాఠశాలలు, ఆసుపత్రులు, పబ్లిక్ పార్కులు, చెరువులు, ఒక హైటెక్ గోశాల వంటి ఎన్నో లగ్జరీ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఎన్‌ఆర్ఐ నిధులే కాకుండా, ఇక్కడి స్థానిక వ్యవసాయం మామిడి, చెరకు పంటలు కూడా గ్రామ ఆర్థిక వ్యవస్థకు అదనపు బలాన్ని ఇస్తోంది. పట్టణ వలసల కారణంగా నేటి కాలంలో ఎన్నో గ్రామాలు వెనుకబడిపోతుంటే, మాధాపర్ గ్రామం మాత్రం విదేశీ సంపాదనను స్వదేశీ ప్రగతికి ఎలా ఉపయోగించవచ్చో ప్రపంచానికి చాటిచెబుతూ ఒక గ్లోబల్ రోల్ మోడల్‌గా నిలిచింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us