Trending Video: ఇంతటి ఘోర ప్రమాదాన్ని ఎప్పుడూ చూసుండరు.. భయపడేవారు వీడియోకు దూరంగా ఉండండి.. కానీ..

|

Jan 21, 2023 | 8:02 PM

రోడ్డుపై డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నడిచి వెళ్తున్నా.. బైక్ పై వెళ్తున్నా.. కారు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నా.. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో ఎవరూ ఊహించలేరు....

Trending Video: ఇంతటి ఘోర ప్రమాదాన్ని ఎప్పుడూ చూసుండరు.. భయపడేవారు వీడియోకు దూరంగా ఉండండి.. కానీ..
Car Accident Video
Follow us on

రోడ్డుపై డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నడిచి వెళ్తున్నా.. బైక్ పై వెళ్తున్నా.. కారు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నా.. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఎప్పుడు, ఎక్కడి నుంచి ఏ వాహనం వచ్చి ఢీకొంటుందో తెలియదు. ప్రమాదాలకు సంబంధించిన వివిధ రకాల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అధిక వేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి వాహనాలు నడపడం వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి ప్రమాదాల్లో డ్రైవర్‌కు తీవ్రగాయాలు లేదా మరణాలు సంభవించే ప్రమాదం ఉంది. ప్రస్తుతం అలాంటి ప్రమాదకరమైన రోడ్డు ప్రమాదం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే.. ప్రమాదం తీవ్రత ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నా.. డ్రైవర్ కు మాత్రం ఏమీ కాకపోవడం విశేషం.

ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్న వీడియోలో అతివేగం కారణంగా కారు ప్రమాదానికి గురైంది. మంచుతో నిండిన ప్రాంతంలో పూర్తిగా నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై అకస్మాత్తుగా ఓ కారు అతివేగంతో వచ్చి రోడ్డు పక్కన ఉన్న రాయిని ఢీకొట్టింది. దీంతో ఆ కారు ఎగిరి బోల్తా పడింది. కానీ డ్రైవర్ కు అందులో కూర్చున్న వ్యక్తికి ఏమీ జరగకపోవడం గమనార్హం. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. కేవలం 27 సెకన్ల ఈ వీడియోను 1 లక్షా 59 వేలకు పైగా వ్యూస్, 6 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేశారు. వీడియోను చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..