Viral Video: తెల్ల హంసల పరోపకారం.. బతికి బయటపడ్డ వందలాది బాతులు.. గొప్ప సామాజిక సందేశమిచ్చే వీడియో

|

Jan 14, 2022 | 4:06 PM

Viral video: జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా  తెల్ల హంసల జంట(Swan Pair) పరోపకారానికి సంబంధించిన..

Viral Video: తెల్ల హంసల పరోపకారం.. బతికి బయటపడ్డ వందలాది బాతులు.. గొప్ప సామాజిక సందేశమిచ్చే వీడియో
Swan Viral Video
Follow us on

Viral video: జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా  తెల్ల హంసల జంట (Swan Pair) పరోపకారానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 19 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియో నెటిజన్లను, పర్యావరణ ప్రియులను బాగా ఆకట్టుకుంటోంది. వీడియో వివరాలకు వెళ్తే.. సరస్సులోని నీరు ఐస్‌లా గడ్డకట్టిపోవడంతో అందులో రెండు హంసలు, వందల సంఖ్యలో బాతులు(Ducks) చిక్కుకపోయాయి. చివరకు రెండు హంసలు ముందుకొచ్చి.. గడ్డగట్టిన నీటిని తమ కళ్లతో పగలగొట్టుకుంటూ ఒడ్డుకు చేరాయి. తద్వారా గడ్డకట్టిన నీటిలో చిక్కుకుపోయిన బాతులు ఒడ్డుకు చేరేందుకు దారి చూపాయి. రెండు హంసలు చూపిన మార్గంలోనే బాతులు కూడా సునాయసంగా ఒడ్డుకు చేరాయి. రెండు హంసలు ముందడుగు వేయకుంటే నీరు మరింత గడ్డకట్టి వాటితో పాటు వందల సంఖ్యలోని బాతులు కూడా మృతి చెందాల్సిన దుస్థితి ఏర్పడేది.

జంతు ప్రియులను ఎంతో ఆకట్టుకుంటున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చాలా క్యూట్‌గా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు దాదాపు 2.32 లక్షల సార్లు చూశారు. ఏడు వేలకు పైగా లైక్స్ వచ్చాయి.  ఇతరులకు సాయపడుతూ రెండు హంసలు చేసిన సాహసం అమోఘమంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Watch Video:

బలహీనులను ఆదుకునే విషయంలో బలవంతులు  ఎప్పుడూ ముందుండాలన్న గొప్ప సామాజిక సందేశాన్ని ఆ హంసలు ఆచరణలో పెట్టి చూపించాయని కొందరు నెటిజన్స్ పేర్కొంటున్నారు.

Also Read..

Viral News: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 800 మందికి తండ్రి అయిన మిల్క్ డెలివరీ బాయ్!

Viral Video:ఓ టీచర్ కొంప ముంచిన వైరల్ వీడియో.. అటు ఉద్యోగం పాయే.. ఇటు భర్త వద్దనబట్టే.. ఇంతకీ ఏమైందంటే..