AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: 12వ అంతస్తు నుంచి వేలాడిన మూడేళ్ల చిన్నారి.. స్టూల్‌తో ప్రాణాలు కాపాడిన పొరుగువారు!

చైనాలో ఓ మూడేళ్ల చిన్నారి 12వ అంతస్తులోని ఫ్లాట్ కిటికీ గ్రిల్ నుంచి బయటకు వేలాడుతూ కనిపించింది. తల కిటికీకి ఉన్న ఇనుప గ్రిల్ మధ్యలో ఇరుక్కుపోవడంతో చిన్నారి కింద పడిపోయే ప్రమాదం ఏర్పడింది. అక్కడికి చేరుకున్న పొరుగువారు, సెక్యూరిటీ సిబ్బంది చిన్నారి శరీరానికి కింద నుంచి స్టూల్‌ను సపోర్టుగా పెట్టి, అగ్నిమాపక సిబ్బంది వచ్చే వరకు చిన్నారి పడిపోకుండా కాపాడారు.

Video: 12వ అంతస్తు నుంచి వేలాడిన మూడేళ్ల చిన్నారి.. స్టూల్‌తో ప్రాణాలు కాపాడిన పొరుగువారు!
Stool Used As Lifeline To Save Girl Child Dangling From Top Floor In China
Sharada V
|

Updated on: Oct 21, 2026 | 8:49 AM

Share

చైనాలో ఓ మూడేళ్ల చిన్నారి 12వ అంతస్తులోని ఫ్లాట్ కిటికీ గ్రిల్ నుంచి బయటకు వేలాడుతూ కనిపించింది. తల కిటికీకి ఉన్న ఇనుప గ్రిల్ మధ్యలో ఇరుక్కుపోవడంతో చిన్నారి కింద పడిపోయే ప్రమాదం ఏర్పడింది. అక్కడికి చేరుకున్న పొరుగువారు, సెక్యూరిటీ సిబ్బంది చిన్నారి శరీరానికి కింద నుంచి స్టూల్‌ను సపోర్టుగా పెట్టి, అగ్నిమాపక సిబ్బంది వచ్చే వరకు చిన్నారి పడిపోకుండా కాపాడారు.

12వ అంతస్తు నుంచి వేలాడుతూ కనిపించిన చిన్నారి

ఫుజియాన్ ప్రావిన్స్‌లోని జాంగ్‌పింగ్ నగరంలో అక్టోబర్ 17వ తేదీ ఉదయం ఈ ఘటన జరిగింది. మూడేళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. చిన్నారి తండ్రి పనికి వెళ్లగా.. తల్లి నిద్రపోతున్న కుమార్తెను ఇంట్లోనే వదిలి సరుకులు కొనడానికి బయటకు వెళ్లింది. ఆ సమయంలో చిన్నారి నిద్రలేచి కిటికీ దగ్గరకు వెళ్లింది. అక్కడి ఇనుప గ్రిల్‌ను దాటి బయటకు వెళ్లే ప్రయత్నంలో ఆమె తల రెండు ఇనుప కడ్డీల మధ్య ఇరుక్కుపోయింది. దీంతో చిన్నారి శరీరం మొత్తం కిటికీ బయటకు వేలాడుతూ ఉండిపోయింది.

స్టూల్‌తో చిన్నారికి అండగా నిలిచిన పొరుగువారు

12వ అంతస్తు నుంచి చిన్నారి వేలాడుతూ ఉండటాన్ని గమనించిన ఓ స్థానిక నివాసి వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ విషయాన్ని ఇతరులకు తెలియచేసేందుకు అపార్ట్‌మెంట్ నివాసితుల గ్రూప్‌లో ఫొటోలు షేర్ చేశారు. దీంతో సెక్యూరిటీ గార్డులు, భవనం నిర్వహణ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. చిన్నారి ఏ క్షణంలోనైనా కింద పడిపోయే ప్రమాదం ఉండటంతో.. వారు వెంటనే ఆమె ఇంటి కింద ఉన్న ఫ్లాట్‌లోకి వెళ్లారు. అక్కడి నుంచి ఇద్దరు వ్యక్తులు వేర్వేరు కిటికీల ద్వారా బయటకు వంగి, చిన్నారి శరీరానికి కింద స్టూల్‌ను సపోర్టుగా ఉంచారు. దీంతో ఆమె బరువుకు కొంత ఆధారం లభించింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చే వరకు చిన్నారి కింద పడకుండా వారు ప్రయత్నించారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో చిన్నారి ఇనుప గ్రిల్‌ను రెండు చేతులతో పట్టుకుని వేలాడుతుండగా.. ఆమెను కాపాడేందుకు స్థానికులు చేస్తున్న ప్రయత్నాలు కనిపిస్తున్నాయి.

చివరకు సురక్షితం

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారి ఉన్న ఫ్లాట్ తలుపును బలవంతంగా తెరిచి లోపలికి వెళ్లారు. అనంతరం ఎంతో జాగ్రత్తగా బాలికను గ్రిల్ నుంచి విడిపించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.అనంతరం చిన్నారిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదని స్థానిక మీడియా కథనంలో తెలిపింది.

చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఇరుగు పొరుగువారిపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని నిమిషాలు ఆలస్యమైనా పెను ప్రమాదం జరిగి ఉండేదనీ, పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కిటికీలు, బాల్కనీల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయడం ఎంత ముఖ్యమో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

Follow Us