AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తెలివైన కాకి, అచ్చం మనిషిలాగే.. నీళ్లలో బిస్కెట్ ముంచుకుని తింటోంది..! వీడియో వైరల్

ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతిరోజూ అనేక వింతైన, ఆసక్తికరమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక కాకి వీడియో నెటిజన్లను విపరీతంగా అలరిస్తోంది. సాధారణంగా మనుషులు బిస్కెట్లను టీ లేదా నీళ్లలో నానబెట్టి తినడం చూస్తుంటాం. కానీ ఒక కాకి కూడా అదే విధంగా బిస్కెట్‌ను నీటిలో ముంచి తినడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Viral Video: తెలివైన కాకి, అచ్చం మనిషిలాగే.. నీళ్లలో బిస్కెట్ ముంచుకుని తింటోంది..! వీడియో వైరల్
Crow Dips Biscuit In Water
Jyothi Gadda
|

Updated on: Aug 22, 2026 | 3:26 PM

Share

మన చిన్నతనంలో నీళ్ల కోసం కుండలో రాళ్లు వేసి నీటి మట్టాన్ని పెంచిన తెలివైన కాకి కథను వినే ఉంటాం. కాకులు ఎంతో తెలివైన పక్షులని శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. అయితే ఈ వీడియోలోని కాకి ప్రవర్తన చూస్తుంటే, ఆ పాత కథకు ఇదొక ఆధునిక రూపంలా కనిపిస్తోంది. ప్రస్తుతం, సోషల్ మీడియాలో ఒక తెలివైన కాకికి సంబంధించిన వీడియో హల్‌చల్ చేస్తోంది. సాధారణంగా పక్షులు ఆహారాన్ని నేరుగా తింటాయి. కానీ, ఈ కాకి మాత్రం మనుషుల మాదిరిగానే బిస్కెట్‌ను నీటిలో నానబెట్టి తింటూ అందరినీ ఆశ్చర్యపరిచింది.

వీడియోలోని వివరాల ప్రకారం.. ఒక వ్యక్తి కాకికి తినడానికి ఒక పొడి బిస్కెట్‌ను అందించాడు. గట్టిగా ఉన్న బిస్కెట్‌ను నేరుగా తినడం కష్టమని భావించిందో ఏమో గానీ, ఆ కాకి తన తెలివితెటలను ప్రదర్శించింది. బిస్కెట్‌ను నోటితో పట్టుకుని, పక్కనే ఉన్న ఒక చిన్న నీటి పాత్ర వద్దకు వెళ్లింది. అందులో బిస్కెట్‌ను కొద్దిసేపు ముంచి, అది మెత్తగా మారిన తర్వాత ఎంతో హాయిగా తినింది. ఈ ప్రక్రియను అది ప్రతిసారీ రిపీట్ చేస్తూ బిస్కెట్ మొత్తాన్ని పూర్తి చేసింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ అయిన కొద్దిసేపటికే లక్షలాది వీక్షణలను సొంతం చేసుకుంది. కాకి సమయస్ఫూర్తిని, ఉపాయాన్ని చూసి నెటిజన్లు మురిసిపోతున్నారు. ఈ కాకి మనకంటే చాలా తెలివైంది, చిన్ననాటి తెలివైన కాకి ఇప్పుడు అప్‌డేట్ అయింది అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మరొక నెటిజన్ అయితే ముందు జాగ్రత్తగా పక్కన కొద్దిగా టీ కూడా పెడితే బాగుండేది అంటూ వ్యాఖ్యానించారు.

వీడియో ఇక్కడ చూడండి..

పక్షులకు ఉన్న సహజ సిద్ధమైన తెలివితేటలను, సమయానుకూల ఆలోచనా విధానాన్ని ఈ వీడియో స్పష్టంగా చూపుతోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతున్న ఈ వీడియో ఇప్పుడు అందరినీ నవ్విస్తూ, ఆలోచింపజేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
అచ్చం మనిషిలాగే..నీళ్లలో బిస్కెట్ ముంచుకుని తింటున్న కాకి! వీడియో
అచ్చం మనిషిలాగే..నీళ్లలో బిస్కెట్ ముంచుకుని తింటున్న కాకి! వీడియో
రాఖీపండుగ తేదీపై పండితుల స్పష్టత..!
రాఖీపండుగ తేదీపై పండితుల స్పష్టత..!
ఇంట్లో శ్రీచక్రం ఉంటే ఏం జరుగుతుంది? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
ఇంట్లో శ్రీచక్రం ఉంటే ఏం జరుగుతుంది? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
కాకి పగ.. 17 ఏళ్లైనా తగ్గేదేలే.. ఈ చిన్న పక్షి మెదడు మిస్టరీ..
కాకి పగ.. 17 ఏళ్లైనా తగ్గేదేలే.. ఈ చిన్న పక్షి మెదడు మిస్టరీ..
బస్సు బీభత్సం.. చిన్నారి సహా ఐదుగురు దుర్మరణం!
బస్సు బీభత్సం.. చిన్నారి సహా ఐదుగురు దుర్మరణం!
రూ.42వేలు ఉన్న క్యాష్‌ బ్యాగ్‌ ఎత్తుకెళ్లిన కోతి..ఏం చేసిందంటే..
రూ.42వేలు ఉన్న క్యాష్‌ బ్యాగ్‌ ఎత్తుకెళ్లిన కోతి..ఏం చేసిందంటే..
ఏపీ, తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు.. వాతావరణశాఖ అప్డేట్..
ఏపీ, తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు.. వాతావరణశాఖ అప్డేట్..
ఏముందే ఈ పాట.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్..
ఏముందే ఈ పాట.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్..
శ్రీలంకలో బయటపడ్డ 582 అస్థిపంజరాలు..చిన్నారులనూ వదిలిపెట్టలేదు!
శ్రీలంకలో బయటపడ్డ 582 అస్థిపంజరాలు..చిన్నారులనూ వదిలిపెట్టలేదు!
మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి..? తెలుసుకోండిలా
మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి..? తెలుసుకోండిలా