AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: టాయిలెట్ బ్రేక్ కాదు.. ఫుల్ బాడీ వర్కౌట్! వైరల్ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..!

విమాన ప్రయాణం అంటే చాలామందికి సౌకర్యవంతమైన ప్రయాణం గుర్తుకొస్తుంది. కానీ విమానాల్లోని టాయిలెట్లు ఎంత చిన్నగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణ ఎత్తు ఉన్నవారే వాటిని ఉపయోగించేటప్పుడు కొంత ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది ఏకంగా 6 అడుగుల 8 అంగుళాల ఎత్తు ఉన్న వ్యక్తి విమానంలోని చిన్నపాటి మరుగుదొడ్డిలోకి వెళ్లాల్సి వస్తే ఎలా ఉంటుంది?

Watch: టాయిలెట్ బ్రేక్ కాదు.. ఫుల్ బాడీ వర్కౌట్! వైరల్ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..!
Tall Man Struggles In Plane Toilet
Balaraju Goud
|

Updated on: Nov 06, 2026 | 4:58 PM

Share

విమాన ప్రయాణం అంటే చాలామందికి సౌకర్యవంతమైన ప్రయాణం గుర్తుకొస్తుంది. కానీ విమానాల్లోని టాయిలెట్లు ఎంత చిన్నగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణ ఎత్తు ఉన్నవారే వాటిని ఉపయోగించేటప్పుడు కొంత ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది ఏకంగా 6 అడుగుల 8 అంగుళాల ఎత్తు ఉన్న వ్యక్తి విమానంలోని చిన్నపాటి మరుగుదొడ్డిలోకి వెళ్లాల్సి వస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.

కెనడాకు చెందిన ట్రావెల్ కంటెంట్ క్రియేటర్లు రేమండ్, రమీసా జంట ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ సరదా ఘటన చోటుచేసుకుంది. రేమండ్ ఎత్తు ఏకంగా 6 అడుగుల 8 అంగుళాలు (సుమారు 203 సెంటీమీటర్లు). దీంతో విమానంలోని చిన్నపాటి వాష్‌రూమ్ ఆయనకు పెద్ద సవాలుగా మారింది.

వైరల్ వీడియోలో రేమండ్ టాయిలెట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే తలుపు చాలా ఇరుకుగా ఉండటంతో నేరుగా లోపలికి వెళ్లలేకపోయాడు. చివరకు శరీరాన్ని వంచుతూ, వివిధ కోణాల్లో తిరుగుతూ ఎలాగోలా లోపలికి ప్రవేశించాడు. లోపలికి వెళ్లిన తర్వాత కూడా నిలబడటానికి, కదలడానికి తగినంత స్థలం లేక ఇబ్బంది పడినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ వీడియోను రమీసా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ.. 6 అడుగుల 8 అంగుళాల ఎత్తుతో ఎయిర్ ఇండియా విమానంలో వాష్‌రూమ్‌కు వెళ్లడం బాత్రూమ్ బ్రేక్ కాదు.. అదొక పూర్తి శరీర వ్యాయామం అంటూ సరదాగా క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కొందరు రేమండ్ పరిస్థితిని చూసి నవ్వుకుంటుండగా, మరికొందరు విమానాల రూపకల్పనపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో ఎయిర్ ఇండియా తప్పు ఎంత? విమానాన్ని తయారు చేసిన బోయింగ్ తప్పు ఎంత? అంటూ ప్రశ్నిస్తున్నారు.

అయితే మరికొందరు ఎయిర్ ఇండియాకు మద్దతుగా నిలుస్తున్నారు. విమానాల తయారీ సంస్థలు బోయింగ్, ఎయిర్‌బస్ రూపొందించిన విమానాలనే ప్రపంచవ్యాప్తంగా అనేక ఎయిర్‌లైన్స్ ఉపయోగిస్తున్నాయని, ఇంత అసాధారణమైన ఎత్తు ఉన్న వ్యక్తికి ఏ విమానంలోనైనా టాయిలెట్ చిన్నగానే అనిపిస్తుందని అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి ఓ సాధారణ వాష్‌రూమ్ బ్రేక్ కాస్తా సోషల్ మీడియాలో నవ్వులు పూయించే వైరల్ వీడియోగా మారింది. విమానాల్లో ప్రయాణికుల సౌకర్యం, ముఖ్యంగా పొడవైన వ్యక్తులకు అందుబాటులో ఉండే స్థలం గురించి మరోసారి చర్చకు తెరలేపింది.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us