జాగ్రత్త! పుచ్చకాయ పైన ప్లాస్టిక్ పొర.. వైరల్ వీడియో చూస్తే పండ్లు తినాలంటేనే భయపడతారు..

వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అందరూ దాహార్తిని తీర్చుకోవడానికి పుచ్చకాయలను ఆశ్రయిస్తారు. కానీ, మీరు కొనే పుచ్చకాయ అసలైనదేనా? లేక విషపూరితమైన రసాయనాలతో నిండి ఉందా? ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మీరు పండ్లు కొనే ముందు వందసార్లు ఆలోచిస్తారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, ఒక వ్యక్తి మార్కెట్ నుండి పుచ్చకాయను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకున్నాడు. దానిని కొంత సమయం రిఫ్రిజిరేటర్‌లో ఉంచి తీసిన తర్వాత, ఆ పుచ్చకాయ పైభాగంలో ఉన్న నల్లటి పొర ప్లాస్టిక్ లాగా విడిపోవడం అతను గమనించాడు. కాయ పై చర్మం కాగితంలా ఊడి రావడం చూసి అతను షాక్‌కు గురయ్యాడు.

జాగ్రత్త! పుచ్చకాయ పైన ప్లాస్టిక్ పొర.. వైరల్ వీడియో చూస్తే పండ్లు తినాలంటేనే భయపడతారు..
Watermelon Plastic Layer

Updated on: Mar 19, 2026 | 6:58 AM

ప్రస్తుతం సమ్మర్ సీజన్‌ మొదలైంది. మార్కెట్లో వివిధ రకాలైన తాజా పండ్లు నోరూరిస్తుంటాయి. ముఖ్యంగా ప్రజలు (వాటర్‌ మిలన్స్‌) పుచ్చకాయలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక వ్యక్తి మార్కెట్ నుండి పుచ్చకాయను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకున్నాడు. తను కొన్న పుచ్చకాయను కడిగి, ఫ్రిజ్‌లో పెట్టాడు. కొద్దిసేపటి తర్వాత దానిని బయటకు తీసి చేత్తో రుద్దగా, పుచ్చకాయ పైనున్న నల్లటి చర్మం ప్లాస్టిక్ పొరలాగా విడిపోవడం మొదలైంది. ఆ వ్యక్తి దానిని నిదానంగా వలుస్తుంటే, అది ఒక పల్చటి ప్లాస్టిక్ కవర్ లాగా ఊడి వచ్చింది. ఇది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా విస్తుపోయారు. మనం పండ్లు తింటున్నామా లేక ప్లాస్టిక్ తింటున్నామా? అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చాలా సందర్భాలలో పండ్లు తాజాగా, నిగనిగలాడుతూ కనిపించడానికి వ్యాపారులు వాటిపై లిక్విడ్ పారాఫిన్ లేదా వాక్స్ కోటింగ్ వేస్తుంటారు. ఇది పండులోని తేమ బయటకు పోకుండా కాపాడుతుంది. తద్వారా పండు ఎక్కువ రోజులు కుళ్లిపోకుండా ఉంటుంది. అయితే, కొన్నిసార్లు తక్కువ నాణ్యత గల రసాయనాలను వాడటం వల్ల ఇలాంటి ప్లాస్టిక్ వంటి పొరలు ఏర్పడతాయి.

ఇవి కూడా చదవండి

కల్తీని గుర్తించడం ఎలా?

మెరుపు: పండు సహజంగా ఉండాల్సిన దానికంటే ఎక్కువగా మెరుస్తుంటే అనుమానించాలి.

వేడి నీరు: పండ్లను గోరువెచ్చని నీటిలో వేసి కడిగితే, పైన ఉన్న వాక్స్ లేదా రసాయన పొరలు కరిగిపోతాయి.

స్క్రాచ్ టెస్ట్: పండుపై గోరుతో లేదా చాకుతో మెల్లగా గీకినప్పుడు తెల్లటి పొడిలాగా వస్తే అది వాక్స్ కోటింగ్ అని గుర్తించాలి.

ఆరోగ్య సమస్యలు:

ఇలాంటి రసాయనాలు కలిగిన పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. ఇవి రక్తంలో కలిస్తే కిడ్నీలు, కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Follow Us