Viral Video: ఓరీ దేవుడో వీడెం మొగుడు.. దారుణంగా భార్యను రెయిలింగ్‌కు వేలాడదీసి..

ఈ వీడియో వేగంగా వైరల్ అయింది. ఈ వీడియో వైరల్ అయిన వెంటనే ప్రజలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. బాధితురాలి భర్త క్రూరత్వాన్ని అందరూ ఖండిస్తున్నారు. అయితే, భార్యాభర్తల మధ్య వివాదం దేనికి సంబంధించినదో ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ సంఘటన గురించి పోలీసులు, స్థానికులు గానీ, ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

Viral Video: ఓరీ దేవుడో వీడెం మొగుడు.. దారుణంగా భార్యను రెయిలింగ్‌కు వేలాడదీసి..
Husband Hung His Wife

Updated on: Jun 07, 2025 | 12:43 PM

ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో అత్యంత దిగ్భ్రాంతికరమైన, హృదయ విదారకమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా వేధికగా ఆ సంఘటన ప్రజలందిరినీ కదిలించింది. ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక భర్త తన భార్యను బహుళ అంతస్తుల భవనం బాల్కనీ నుండి వేలాడదీస్తూ హింసిస్తున్న దృశ్యం పెను సంచలనంగా మారింది. భార్య భర్తల మధ్య తగాదాల నేపథ్యంలో ఆమెను బిల్డింగ్‌ రెయిలింగ్‌కు వేలాడదీశాడు ఆమె భర్త. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోలో భార్య అరుపులు, వేడుకుంటున్న దృశ్యాలు కనిపించాయి.

వైరల్‌ వీడియోలో కనిపించిన బాధిత మహిళ పూర్తిగా నిస్సహాయ స్థితిలో చావుతో పోరాటం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. తన ప్రాణాలను కాపాడుకోవడానికి కష్టపడుతోంది. అదే సమయంలో, అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఉన్న ఇతర వ్యక్తులు ఆమె భర్తను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆమెను పైకి లాగమని ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ అతను ఎవరి మాట వినడంలేదు. బాధితురాలు భయంతో అరుస్తూ సహాయం కోసం కేకలు వేస్తుంది. అంతలోనే ఒక గుర్తు తెలియని వ్యక్తి ఈ మొత్తం సంఘటనను మొబైల్ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఆ తర్వాత ఈ వీడియో వేగంగా వైరల్ అయింది. ఈ వీడియో వైరల్ అయిన వెంటనే ప్రజలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. బాధితురాలి భర్త క్రూరత్వాన్ని అందరూ ఖండిస్తున్నారు. అయితే, భార్యాభర్తల మధ్య వివాదం దేనికి సంబంధించినదో ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ సంఘటన గురించి పోలీసులు, స్థానికులు గానీ, ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కానీ ఈ సంఘటన గృహ హింసను గుర్తు చేస్తోంది. స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు బాధితురాలి భర్తను అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని సమాచారం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..