మరణం గురించి మాట్లాడిన ఫాదర్‌.. గోడకు ఉన్న భారీ శిలువ కూలి మృతి.. !

ఈక్వెడార్‌ చర్చిలో విషాదం చోటుచేసుకుంది. ప్రార్థనలు నిర్వహిస్తూ మరణం, జీవితం గురించి సందేశం ఇస్తున్న ఓ క్యాథలిక్‌ పాస్టర్‌.. కొద్ది క్షణాలకే ప్రాణాలు విడిచారు. వెనుక గోడకు అమర్చిన భారీ శిలువ హఠాత్తుగా ఊడి తలపై పడటంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటన చర్చిలో ప్రత్యక్ష ప్రసారం అవుతుండగా కెమెరాలో రికార్డైంది.

మరణం గురించి మాట్లాడిన ఫాదర్‌.. గోడకు ఉన్న భారీ శిలువ కూలి మృతి.. !
Priest Speaks About Death In Sermon Dies Later As Cross Falls On Him

Updated on: Oct 20, 2026 | 6:04 PM

ఈక్వెడార్‌ చర్చిలో విషాదం చోటుచేసుకుంది. ప్రార్థనలు నిర్వహిస్తూ మరణం, జీవితం గురించి సందేశం ఇస్తున్న ఓ క్యాథలిక్‌ పాస్టర్‌.. కొద్ది క్షణాలకే ప్రాణాలు విడిచారు. వెనుక గోడకు అమర్చిన భారీ శిలువ హఠాత్తుగా ఊడి తలపై పడటంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటన చర్చిలో ప్రత్యక్ష ప్రసారం అవుతుండగా కెమెరాలో రికార్డైంది.

మరణం గురించి మాట్లాడిన కొద్దిసేపటికే విషాదం

ఈక్వెడార్‌ దేశం గుయాక్విల్‌లోని చర్చిలో ఫాదర్ పాట్రిసియో ఆల్ఫ్రెడో సాంచెజ్ మోలినారి ప్రార్థనలు నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రార్థనలో భాగంగా ఆయన జీవితం విలువ, మరణం గురించి వివరించారు. మనిషి జీవితం శాశ్వతం కాదని, ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరూ మరణించాల్సిందేనని చెప్పారు. మొబైల్ ఫోన్లలో ఎక్కువ సమయం గడపకుండా, దేవుడి కోసం, కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో గడిపేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ‘ఒక రోజు ఇక్కడ ఉన్న మనం అందరం కూడా మరణిస్తాం. కొన్నిసార్లు మనం కొన్ని పనుల కోసం కేటాయించే సమయం కంటే దేవుడితో గడిపే సమయమే ఎక్కువ అర్థవంతమైంది’ అన్నారు. ఆ తర్వాత అందరినీ ఆశీర్వదించాలని దేవుడిని ప్రార్థించేందుకు సిద్ధమయ్యారు. అంతలోనే ఆయన వెనుక గోడకు అమర్చిన భారీ శిలువ ఒక్కసారిగా ఊడి ముందుకు పడింది.

కుప్పకూలిన ఫాదర్.. తలపై పడిన భారీ శిలువ..

ఆ సమయంలో ఫాదర్ మోలినారి బలిపీఠం వెనుక నిలబడి భక్తుల వైపు చూస్తున్నారు. తన వెనుక జరుగుతున్న ప్రమాదాన్ని ఆయన గుర్తించలేకపోయారు. అకస్మాత్తుగా శిలువ ఆయన తల వెనుక భాగంపై పడటంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. శిలువ పడిన తర్వాత ఆయన తిరిగి లేవలేదు. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు భయంతో కేకలు వేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కొందరు వెంటనే ఆయన వద్దకు పరుగెత్తి సహాయం కోసం ప్రయత్నించగా, మరికొందరు అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అత్యవసర వైద్య సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అయితే, అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారు. చర్చిలో ప్రార్థనలు ప్రత్యక్ష ప్రసారం అవుతుండటంతో ఈ ప్రమాదం కెమెరాలో రికార్డైంది. అనంతరం ఆ లైవ్‌స్ట్రీమ్‌ను తొలగించారు.

ఫాదర్ మృతిపై చర్చి సంతాపం

ఫాదర్ మోలినారి మృతిపై గుయాక్విల్ ఆర్చ్‌ డయోసిస్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.  ఆయన జ్ఞాపకార్థం ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేసింది.  గోడకు అమర్చిన భారీ శిలువ ఎందుకు ఊడిపోయిందనే విషయం తెలియలేదు. ఈ ప్రమాదానికి గల కారణాలపై చర్చి అధికారులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. మరణం గురించి భక్తులకు బోధించిన కొద్దిసేపటికే ఫాదర్ ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేస్తోంది. ఈ విషాద ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Loading...
Unable to load recommendations.
Follow Us