AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హోటల్ బిల్లు రూ. 1200 సేవ్.. వైష్ణో దేవి యాత్రికుడి ధురంధర్ ప్లాన్ అదిరిపోయింది!

ప్రయాణాల్లో బడ్జెట్‌ను ప్లాన్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, అనుకోని పరిస్థితుల్లో ఖర్చులను తగ్గించుకోవడం మరొక ఎత్తు. ఎందుకంటే.. సాధారణంగా తీర్థయాత్రలకు లేదా సుదూర ప్రయాణాలకు వెళ్లినప్పుడు రైళ్లు ఆలస్యమవ్వడమో లేదా కనెక్టింగ్ రైళ్ల కోసం గంటల తరబడి వేచి చూడటమో జరుగుతుంటుంది. అటువంటప్పుడు చాలా మంది స్టేషన్ బయట ఉన్న హోటళ్లలో గదులు తీసుకుని వేల రూపాయలు ఖర్చు చేస్తారు. కానీ, ఒక స్మార్ట్ యాత్రికుడు మాత్రం భిన్నంగా ఆలోచించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

హోటల్ బిల్లు రూ. 1200 సేవ్.. వైష్ణో దేవి యాత్రికుడి ధురంధర్ ప్లాన్ అదిరిపోయింది!
Smart Travel Hack
Jyothi Gadda
|

Updated on: Mar 28, 2026 | 5:40 PM

Share

అవును, నిజంగానే ప్రయాణాల్లో బడ్జెట్ మేనేజ్మెంట్ అనేది ఒక కళ. ఎందుకంటే.. మనం ఎక్కడికైనా వెళ్లినప్పుడు రైలు లేదా బస్సు కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తే, వెంటనే చేసే పని ఏదైనా హోటల్ గదిని వెతకడం. కానీ, ఒక వైష్ణో దేవి యాత్రికుడు మాత్రం హోటల్ గదికి బదులు సినిమా థియేటర్‌ను ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. తన తెలివితేటలతో ఏకంగా రూ. 1,200 వరకు ఆదా చేసిన ఈ ఉదంతం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అసలేం జరిగిందంటే…

వైష్ణో దేవి యాత్ర ముగించుకుని కత్రా నుండి తిరిగి వస్తున్న ఒక వ్యక్తికి రైలు దొరకడానికి చాలా సమయం పట్టింది. ఆ సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి బయట హోటల్ విచారించగా సుమారు రూ. 1200 అడిగారు. కేవలం కొన్ని గంటల విశ్రాంతి కోసం అంత మొత్తం ఖర్చు చేయడం ఇష్టం లేక, ఆయన ఒక వినూత్న ఆలోచన చేశారు. రైల్వే స్టేషన్ లోని ధురంధర్ 2 (Dhurandhar 2) వెయిటింగ్ ఏరియాను ఎంచుకున్నారు. ఇండియన్ రైల్వేస్ ముఖ్యమైన స్టేషన్లలో ప్రయాణికుల కోసం ఏసీ వెయిటింగ్ హాళ్లు, డార్మిటరీలు, రిటైరింగ్ రూమ్స్ నిర్వహిస్తోంది. ధురంధర్ వంటి ఆధునిక వెయిటింగ్ సెంటర్లు చాలా తక్కువ ధరకే గంటకు రూ. 20 నుండి రూ. 50 వరకు లభిస్తాయి.

ఇవి కూడా చదవండి

ఇక, ఇక్కడ అన్ని రకాలు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ కూర్చునేందుకు సోఫాలు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, శుభ్రమైన మరుగుదొడ్లు, వై-ఫై సదుపాయం ఉంటాయి. స్టేషన్ లోపలే ఉండటం వల్ల లగేజీ భద్రత గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. సదరు వ్యక్తి తన అనుభవాన్ని పంచుకుంటూ..మనం కొంచెం వెతికితే రైల్వే స్టేషన్లలోనే అద్భుతమైన వసతులు ఉంటాయి. హోటల్ కు రూ. 1200 ఇచ్చే బదులు, ఇక్కడ కేవలం వంద రూపాయల లోపే నా విశ్రాంతి పూర్తయింది అని పేర్కొన్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ విషయాన్ని సదరు వ్యక్తి సోషల్ మీడియాలో పంచుకోగానే నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఇది కదా అసలైన ఇండియన్ జుగాడ్ (తెలివైన ఉపాయం) అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, కొంతమంది ప్రయాణికులు తమ భారీ లగేజీని ఎక్కడ పెట్టాలనే సందేహాన్ని వ్యక్తం చేశారు. దానికి సమాధానంగా, రైల్వే స్టేషన్లలో ఉండే క్లోక్ రూమ్ (Cloak Room) సదుపాయాన్ని వాడుకుంటే తక్కువ ధరకే లగేజీ భద్రంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రయాణాల్లో ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ పాటించడం వల్ల భారీగా డబ్బు ఆదా చేయవచ్చు. ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్ ద్వారా ముందే రిటైరింగ్ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఇది మీ ప్రయాణ ఖర్చును గణనీయంగా తగ్గిస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
వారానికి రెండుసార్లు ఇవి తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే!
వారానికి రెండుసార్లు ఇవి తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే!
బాపట్ల తీరానికి కొట్టుకొచ్చిన శివలింగ పీఠం, దేవతా విగ్రహాలు
బాపట్ల తీరానికి కొట్టుకొచ్చిన శివలింగ పీఠం, దేవతా విగ్రహాలు
ముగిసిన హార్దిక్ ట్రేడింగ్.. బలిపశువుల్లా ఆ ఇద్దరు
ముగిసిన హార్దిక్ ట్రేడింగ్.. బలిపశువుల్లా ఆ ఇద్దరు
లాగినా రాలని ఒత్తైన జుట్టు కోసం డెర్మటాలజిస్ట్ సీక్రెట్ టిప్స్
లాగినా రాలని ఒత్తైన జుట్టు కోసం డెర్మటాలజిస్ట్ సీక్రెట్ టిప్స్
అదృష్టం అంటే ఇదే.. పూజ బంగారం కాలువలో దొరికింది..
అదృష్టం అంటే ఇదే.. పూజ బంగారం కాలువలో దొరికింది..
సాంగ్ అంటే ఇది.. నెట్టింట దుమ్మురేపుతున్న ఫోక్ సాంగ్.
సాంగ్ అంటే ఇది.. నెట్టింట దుమ్మురేపుతున్న ఫోక్ సాంగ్.
కొత్త సిమ్ కార్డు తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త రూల్స్ ఇవే
కొత్త సిమ్ కార్డు తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త రూల్స్ ఇవే
అబద్ధం చెప్పిన గంభీర్‌.. కట్‌చేస్తే.. షాకివ్వనున్న బీసీసీఐ?
అబద్ధం చెప్పిన గంభీర్‌.. కట్‌చేస్తే.. షాకివ్వనున్న బీసీసీఐ?
స్కూల్‌లో ఉపాధ్యాయురాలి వింత ప్రవర్తణ.. సీన్ కట్‌చేస్తే..
స్కూల్‌లో ఉపాధ్యాయురాలి వింత ప్రవర్తణ.. సీన్ కట్‌చేస్తే..
బిగ్‌ బాస్‌ 10లో జబర్దస్త్ స్టార్ కమెడియన్.. 100 శాతం కన్ఫార్మ్
బిగ్‌ బాస్‌ 10లో జబర్దస్త్ స్టార్ కమెడియన్.. 100 శాతం కన్ఫార్మ్