తమిళనాడు తిరుప్పూర్ జిల్లాలోని అరుల్మిగు సుబ్రమణ్య స్వామి ఆలయంలో జరిగిన ఓ అద్భుత సంఘటన చోటుచేసుకుంది. ఆలయంలోని గర్భగుడి వద్ద నెమలి కనిపించింది. ఆ అద్భుత దృశ్యాన్ని చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇది అంతా ఆ దేవుడి లీల అంటు భక్తులు అంటున్నారు.
గత వారం ఈ అద్భుత దృశ్యం సాకారమైంది. వందలాది మంది భక్తుల సమక్షంలో, సుబ్రమణ్య స్వామికి హారతి ఇస్తున్న సమయంలో నెమలి గర్భగుడి ముందు సందడి చేసింది. సుబ్రమణ్య స్వామి విగ్రహానికి హారతి ఇచ్చిన తర్వాత పండితులు నెమలికి సైతం హారతి ఇచ్చారు. అంత మంది భక్తులు ఉన్నా నెమలి అక్కడి నుంచి కదలకుండా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది చూసిన భక్తులంతా ఇది ఆ భగవంతుడి లీల అంటున్నారు.
ఇదిలా ఉంటే హిందూ మత విశ్వాసాల ప్రకారం నెమలిని కుమార స్వామి వాహనంగా చెబుతుంటారు. అంతేకాకుండా నెమలి కన్నులు జ్ఞానానికి, అవగాహనకు, వివేకానికి ప్రతీకగా చెబుతుంటారు. ఈ అద్భుత దృశ్యాన్ని ఆలయానికి వచ్చిన భక్తులంతా సెల్ ఫోన్‌లో రికార్డ్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆలయంలో నెమలి సందడి చేయడంపై ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ.. ‘నెమళ్లు తరచుగా ఈ ఆలయాన్ని సందర్శిస్తాయి.
ఈసారి నెమలి గర్భగుడిలోకి వెళ్లి మురుగుడిని పూజించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది దేవుడి మహిమకు నిదర్శనం. ఇది ప్రజలకు దేవుడిపై నమ్మకం పెరగడానికి కారణంగా చెప్పొచ్చు. ఈ అద్భుత ఘట్టాన్ని చూసిన భక్తులు తమ జీవితంలో మరిచిపోలేని అనుభూతిని ఇచ్చింది’ అంటూ రాసుకొచ్చారు.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..