Optical Illusion Test: చూద్దాం! మీ ఐక్యూ లెవల్‌ ఏ స్థాయిలో ఉందో.. 20 సెకన్లలో ఎన్ని డాల్ఫిన్లు ఉన్నాయో చెప్పారంటే..

ఈ పిక్చర్‌ మీ దృష్టిని మాత్రమేకాకుండా మీ IQ లెవల్స్‌ను కూడా పరీక్షిస్తుంది. ఈ పిక్చర్‌లో వరుసగా ఎన్ని డాల్ఫిన్లు కన్పిస్తున్నాయో..

Optical Illusion Test: చూద్దాం! మీ ఐక్యూ లెవల్‌ ఏ స్థాయిలో ఉందో.. 20 సెకన్లలో ఎన్ని డాల్ఫిన్లు ఉన్నాయో చెప్పారంటే..
Optical Illusion

Updated on: Jul 23, 2022 | 5:18 PM

Optical illusion images with answers: బుర్రకు పదును పెట్టాలంటే ఫజిల్స్‌, ఆప్టికల్ ఇల్యూషన్ టెస్ట్స్‌ వంటివి ట్రై చేస్తు ఉండాలి. చూసేదంతా నిజం కాదని, చూసే చిత్రంలో అంతర్లీనంగా దాగున్న సమాధానాన్ని సెకన్లలో కళ్ళతో పసిగట్టగలిగేందుకే ఇలాంటి టెస్టులు పనికివస్తాయి. నిజానికి ఈ ట్రిక్‌ అంత సులువుగా అబ్బదు. ఎందుకంటే అవి భ్రమను కలిగిస్తాయి. లేనిదాన్ని నమ్మేలా మన మెదడును మోసగిస్తాయి. అందుకే ఆప్టికల్ ఇల్యూషన్‌ టెస్టులను ఆడి మీ దృష్టిని పరీక్షించుకోవాలి. ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్ టెస్ట్‌ అటువంటిదే. ఈ పిక్చర్‌ మీ దృష్టిని మాత్రమేకాకుండా మీ IQ లెవల్స్‌ను కూడా పరీక్షిస్తుంది. ఈ పిక్చర్‌లో వరుసగా డాల్ఫిన్లు కన్పిస్తున్నాయి కదా. ఐతే చూడగానే ఎన్ని డాల్ఫిన్లు ఉన్నాయని అడగగానే.. టక్కుమని 9 సమాధానం ఇవ్వకండి. ఎందుకంటే.. చూసే దంతా నిజం కాదని ముందే చెప్పుకున్నాం కదా! ప్రస్తుతం ఈ పిక్చర్ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది కరెక్ట్‌ ఆన్సర్‌ చెప్పడంలో విఫలమయ్యారు. మీరు కూడా ప్రయత్నించండి. సమాధానం దొరకకపోతే మీకో చిన్న క్లూ..

పిక్చర్‌ను కొంచెం జూమ్ చేసి చూడండి.. దీనిలోని మ్యాజిక్‌ ఏమిటో మీకే తెలుస్తుంది. చిన్న చిన్న డాల్ఫిన్లు కన్పిస్తాయి. మరికొన్ని పక్కపక్కనే ఉంటాయి. లెక్కపెట్టగలిగారా? కరెక్ట్‌ ఆన్సర్ కోసం ఈ పేజ్‌ చివర చూడొచ్చు. IQ స్థాయిలు అధికంగా ఉన్నవారు మాత్రమే కరెక్ట్‌ ఆన్సర్‌కి దగ్గరి సమాధానాలు చెప్పగలరు.

ఇవి కూడా చదవండి

Optical Illusion Test Answers

సమాధానం: 17 డాల్ఫిన్లు ఉన్నాయి. జూమ్‌ చేసి మళ్లీ లెక్కపెట్టండి. ఈ సారి మీకు కరెర్ట్‌ ఆన్సర్‌ వస్తుంది.