AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: దమ్ముంటే కాస్కో.. ఈ ఫోటోలో ఉన్న 3 గుడ్లగూబలను గుర్తిస్తే.. మీరే తోపులు!

సోషల్ మీడియాలో తరచూ వైరల్‌గా మారే ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు జనాలను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. ఎందుకుంటే ఇవి ఎప్పుడూ జనాల తెలివితేటలను సవాల్ చేస్తూ ఉంటాయి. వారు కూడా వాటిని ఛాలెంజ్‌గా తీసుకొని సాల్వ్ చేసి తమ తెలివితేటలను పెంచుకుంటారు. మీరు ఇలానే తెలివితేటలను పెంచుకోవాలి అనుకుంటే ఈ చిత్రాన్ని సాల్వ్ చేయండి.

Optical Illusion: దమ్ముంటే కాస్కో.. ఈ ఫోటోలో ఉన్న 3 గుడ్లగూబలను గుర్తిస్తే.. మీరే తోపులు!
Optical Illusion
Anand T
|

Updated on: May 25, 2026 | 1:38 PM

Share

Optical Illusion Owl Photo: మీరు సోషల్ మీడియాలో తరచూ అనేక చిత్రాలు, వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని ఫోటోలు వ్యక్తుల స్వభావాన్ని తెలియజేస్తే.. మరికొన్ని ఫోటోలు జనాల తెలివితేటలను సవాల్ చేస్తాయి.. అలాంటి ఫోటోలో దాగి ఉన్న విషయాలను మీరు కనిపెట్టాల్సి ఉంటుంది. ఇవి మొదట్లో కాస్త కంగారు పెట్టినప్పటికీ.. వాటిని సాల్వ్ చేయడం ద్వారా మీరు ఎంతో తృప్తి పొందుతారు. ఇవి కేవలం మీ కళ్లకు, బ్రెయిన్‌కు పని చెప్పడమే కాకుండా మీ తెలివితేటను పెంచేందుకు కూడా సహాయపడుతాయి. ఈ ప్రక్రియ మీకు నిజ జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి కూడా ఎంతగానో సహాయపడుతుది.

మీరు కూడా ఇలా ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు సాల్వ్ చేయడం ద్వారా మీ తెలివతేటలను పెంచుకోవాలి అనుకుంటే ఇదే మంచి అవకాశం.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆప్టికల్ ఇల్యూషన్ పిక్చర్‌ను సాల్వ్ చేసేందుకు ట్రై చేయండి. అక్కడ మీ టాస్క్ ఏమిటంటే ఈ చిత్రంలో దాగి ఉన్న పక్షులను మీరు కనిపెట్టాలి.. తొలుత ఇది మీకు కష్టంగా అనిపించినా.. రెండు మూడు సార్లు ట్రై చేస్తే మీరు ఈజీగా వాటిని గుర్తించవచ్చు.

వైరల్ చిత్రంలో ఏముంది

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ చిత్రంలో మీకు కొందరు వ్యక్తులు సూడ్ ధరించి ఉన్నట్టు కనిపిస్తుంది. అక్కడ ఉన్న వ్యక్తులు చేతుల్లో కొన్ని పెంపుడు జంతువులు, పక్షులు కూడా ఉన్నాయి. అయితే వాటిలో మూడు గుడ్లగూబలు కూడా దాగి ఉన్నాయి. ఇక్కడ మీ టాస్క్ ఏమిటంటే.. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలో దాగి ఉన్న గుడ్లగూబలు 10 సెకన్లలో గుర్తించాలి. మీరు పరిశీలన శక్తి ఎక్కువగా ఉంటే.. మీరు ఈ ఛాలెంజ్ పూర్తి చేయవచ్చు. అయితే మీరు సవాల్‌ను స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటే.. ఇప్పుడు మీ టైం స్టార్ట్ అవుతుంది.

సమాధానం ఇక్కడుంది.

మీకు ఇచ్చిన టైంలో ఈ చిత్రంలో దాగి ఉన్న మూడు గుడ్లగూబలను గుర్తించి ఉంటే కంట్రాగ్స్.. మీకు పరిశీలనలు శక్తి బాగా ఉందని అర్థం.. ఒక వేళ మీరు సమాధానం కనిపెట్టకపోయినా ఏం పర్లేదు.. మీకు మేం సహాయం చేస్తాం.. మేం కింద ఇచ్చిన చిత్రంలో అక్కడ నిల్చున్న వ్యక్తుల చేతిలో ఉన్న గుడ్లగూబలను సర్కిల్ చేసి ఉంచాం. అక్కడ మీరు సమాధానం కనిపెట్టవచ్చు.

Optical Illusion Test

Optical Illusion Test

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us