Optical Illusion: భళారే విచిత్రం.. ఈ ఫొటోలో ముగ్గురు అమ్మాయిల మొహాలు ఉన్నాయి కనిపెట్టండి చూద్దాం..!

|

Nov 25, 2022 | 5:01 PM

ఈ ఫొటోల్లో ఒక వస్తువో లేక ఒక జంతువో దాగివుంటుంది. కానీ అది మనకు కలిపించాదు. ఎంతో తీక్షణంగా చూస్తే తప్ప అది మన కంటికి కనిపించదు.

Optical Illusion: భళారే విచిత్రం.. ఈ ఫొటోలో ముగ్గురు అమ్మాయిల మొహాలు ఉన్నాయి కనిపెట్టండి చూద్దాం..!
Optical Illusion.
Follow us on

మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి.. మనకు కావాల్సిన వస్తువు మన కాళ్ళ ముందే ఉన్న కొన్నిసార్లు మనకు అది కనిపించదు. ఇక ఆప్టికల్ ఇల్యూజన్ అనే పేరుతో చాలా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఈ ఫొటోల్లో ఒక వస్తువో లేక ఒక జంతువో దాగివుంటుంది. కానీ అది మనకు కలిపించాదు. ఎంతో తీక్షణంగా చూస్తే తప్ప అది మన కంటికి కనిపించదు. ఇప్పుడు ఇలా పజిల్స్ కు నెట్టింట మంచి డిమాండ్ ఉంది. పైన కనిపిస్తోన్న ఫోటో కూడా అలాంటిది. పై కనిపిస్తున్న ఒక వ్యక్తి ఫొటోలో ముగ్గురు మహిళల మొఖాలు దాగి ఉన్నాయి. అయితే 30 సెకన్లలో ఈ వ్యక్తిలో దాగి ఉన్న ముగ్గురు అమ్మాయిలను కనుక్కోవాలి.

చాలా మంది ఈ ఫొటోలో అమ్మాయిలను కనిపెట్టలేకపోయారు. కొంతమంది నిమిషం టైం తీసుకున్నా కూడా ఆ మహిళల మొహాలను గుర్తుపట్టలేకపోయారు. ఈ ఫోటో చూడటానికి చాలా సరదాగా ఉంది. ఇలాంటి చిత్రాలను తరచుగా చూడటం ద్వారా సమాధానం సులభంగా కనుగొనవచ్చు . మరి మీరు కనుకున్నారా..?

ఈ ఫొటోలోని వ్యక్తి  పొడవాటి ముక్కు, గడ్డం అలాగే సూట్‌ని గమనించండి. మీకు ఆన్సర్ దొరికేస్తుంది. ఇది కొంచెం క్లిష్టంగా ఉంటుంది. అయితే, అప్పుడప్పుడూ ఇలాంటి పజిల్స్ సాల్వ్ చేయడం వల్ల మీ సహనాన్ని పెంపొందించుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి

Optical Illusion