ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతిరోజూ వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని రకాల వీడియోలను నెటిజన్లను ఆకర్షిస్తాయి.. వాటిని ఇష్టపడటమే కాకుండా ఒకరితో ఒకరు విస్తృతంగా షేర్ చేస్తూ ఉంటారు. అయితే కొన్ని వీడియోలు హృదయానికి హత్తుకునే విధంగా ఉంటాయి. ముఖ్యంగా అమ్మ ప్రేమకి సంబంధించిన వీడియో వైరల్ అయినప్పుడల్లా అది చూసిన ఎవరైనా సరే మనకు మన అమ్మ గుర్తొస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన ఎవరికైనా సరే తమకు తమ అమ్మ ప్రేమని ఖచ్చితంగా గుర్తు చేస్తుంది.
తమ ఇంట్లో ఎంత పేదరికం ఉన్నా.. తన పిల్లలకు తమ పేదరికం వలన ఇబ్బంది తలెత్తకూడదని.. తన శక్తికి మించి తన పిల్లల అవసరాలను తీరుస్తుంది. మండే ఎండని కూడా తన పిల్లలకు చల్ల గాలిగా మారుస్తుంది. సున్నితంగా కనిపించే “తల్లి” తన పిల్లలకు “గొడుగు”గా మారుతుందని అంటారు.. ఈ సామెతను ప్రతిబింబించే ఈ వీడియో ప్రస్తుతం ఎక్కువగా వైరల్ అవుతోంది. ఒక తల్లి తన పిల్లలను పోషించడానికి బెలూన్లు అమ్ముతోంది. ఇది చూసిన తర్వాత ఎవరికైనా అమ్మ గుర్తుకు వస్తుంది.
Mother, Daughters, and Digital India…. pic.twitter.com/gmukSKALUP
— Lt Col Amol Awate(Veteran),IAS🇮🇳 (@AmolAwate79) October 29, 2023
వైరల్ అవుతున్న వీడియోలో ఒక మహిళ బెలూన్లు అమ్ముతున్నట్లు మీరు చూడవచ్చు. ఆమె ముఖంలో సంతోషం ఎవరినైనా ఆకట్టుకుంటుంది. ఈ సమయంలో ఇద్దరు పిల్లలు ఫోటో తీయమని పట్టుబట్టారు. అప్పుడు ఆ తల్లి ఎంతో సంతోషంగా నవ్వుతూ ఆ ఇద్దరి పిల్లల ఫోటోని ఫోన్ లో తీసింది.
ఈ వీడియో చూశాక ఒక విషయం అర్ధమవుతుంది. ఎన్ని ప్రతికూల పరిస్థితుల్లో బతుకుతున్నా తల్లి తమ ఆడ పిల్లలకు అందాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలని భావిస్తోంది. అందుకు తగిన విధంగా ఎంతకష్టమైనా పడుతుంది. ఈ వీడియో Twitter @AmolAwate79లో షేర్ చేశారు. 74 వేల మందికి పైగా దీన్ని చూశారు. కామెంట్ చేస్తూ తమ రియాక్షన్స్ ఇస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..