Viral Video: పక్కా తాగుబోతులకు గురువే భయ్యా ఇది.. ఎత్తిన బాటిల్ దింపితే ఒట్టు..
Viral Video: కష్టమొచ్చినా.. సుఖమొచ్చినా.. బాధొచ్చినా.. బంధం ఏర్పడినా.. ఆ బంధం తెగిపోయినా.. అన్నివేళలా స్నేహితుడు మందే బ్రదర్..
Viral Video: కష్టమొచ్చినా.. సుఖమొచ్చినా.. బాధొచ్చినా.. బంధం ఏర్పడినా.. ఆ బంధం తెగిపోయినా.. అన్నివేళలా స్నేహితుడు మందే బ్రదర్ అని మద్యం ప్రియులు చెబుతారు. అన్నింటిని కంట్రోల్ చేసే శక్తి ఆ మందుకే ఉందంటారు. ఎందుకంటే.. వారి ఫీలింగ్స్ వారివి కాబట్టి. సరే ఇదిలాఉంచితే.. మనుషులు మద్యం తాగడం కామన్. ఏవో ఫీలింగ్స్, అవీ ఇవీ ఉంటాయి కాబట్టి. మరి జంతువులు మద్యం తాగడం చూశారా? చూసే ఉంటారనుకుందాం. కానీ, పీపాలకు పీపాలకు మందు కొట్టడం ఎప్పుడైనా చూశారా? చూడకపోతే ఇప్పుడు చూసేయండి. ఒక్క మద్యం తాగడం మాత్రమే కాదండోయ్.. మందు తరువాత చిందులు, ఆ తరువాత ముఖంలో కనిపించే హావభావాలు మామూలు కథ కాదు అది. ఇంకెందుకు ఆలస్యం ఇక మ్యాటర్‌లోకి వెళదాం.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో రెండు కోతులు పక్క పక్కనే కూర్చున్నాయి. అందులో ఓ కోతి చేతిలో భారీ మందు బాటిల్ ఉంది. ఆ బాటిల్ ఎత్తి గటగటా తాగేసింది మద్యం. నాన్ స్టాప్‌గా కుమ్మేసింది. పక్కనున్న కోతి చూస్తున్నప్పటికీ కనీసం షేర్ చేసుకోలేదు. ఫుల్లుగా తాగిన కాసేటికి ఆ కోతికి మద్యం మత్తు ఎక్కడం స్టార్ట్ అయ్యింది. ఇక చూసుకోవాలి నా సామిరంగా.. ఆ కోతి ముఖంలో రకరకాల హావభావాలు దర్శనం ఇస్తున్నాయి. మరికాసేపటికి రోడ్డుపైకి ఎక్కడి తల కిందకు, కాళ్లు పైకి పెట్టి.. చేతులపై నడుస్తూ నానా హంగామా చేసింది. ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. నెటిజన్లు పడి పడి నవ్వుతున్నారు. దాని వేశాలు చూసి పొట్టచెక్కలయ్యేలా నవ్వుతూ.. రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..