AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సౌండ్ వింటే చనిపోతుంది.. తలను బొంగరంలా తిప్పేస్తుంది.. ఈ వింత జీవి రూటే సెపరేట్..

ప్రపంచంలో ఎన్నో వింత జీవులు ఉన్నాయి కానీ.. దీని రూటే సెపరేటు.. దీని బరువు కేవలం 100 గ్రాములే.. చిన్న టెన్షన్ వస్తే చాలు ఆత్మహత్య చేసుకునే వింత అలవాటు దీని సొంతం. అంతేకాదు, కనుగుడ్లు తిప్పలేదు కానీ గుడ్లగూబలా తలని 180 డిగ్రీలు తిప్పేస్తుంది.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ జీవిం గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

సౌండ్ వింటే చనిపోతుంది.. తలను బొంగరంలా  తిప్పేస్తుంది.. ఈ వింత జీవి రూటే సెపరేట్..
Philippine Tarsier Facts
Krishna S
|

Updated on: Jul 11, 2026 | 12:34 PM

Share

ఈ ప్రపంచంలో మనల్ని ముక్కున వేలేసుకునేలా చేసే వింత జీవులు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని వేగానికి, మరికొన్ని బలానికి ఫేమస్ అయితే.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న జీవి మాత్రం తనకున్న విచిత్రమైన అలవాట్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఫిలిప్పీన్స్ అడవుల్లో మాత్రమే కనిపించే ఈ జీవి పేరు ఫిలిప్పీన్ టార్సియర్. ప్రపంచంలోనే అత్యంత విలక్షణమైన, ప్రశాంతమైన క్షీరదాలలో ఇదొకటి. కానీ దీని వెనుక ఉన్న క్రేజీ ఫ్యాక్ట్స్ తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు.

చిన్న టెన్షన్ వస్తే చాలు.. సూసైడ్ చేసుకుంటుంది..

ప్రకృతి కొన్ని జీవులను ఎంత సున్నితంగా సృష్టిస్తుందో చెప్పడానికి ఈ టార్సియర్ ఒక పెద్ద ఉదాహరణ. ఇవి ఎంత సెన్సిటివ్ అంటే.. పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినా లేదా కెమెరా ఫ్లాష్ లైట్లు మొహం మీద పడినా విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవుతాయి. ఆ టెన్షన్ తట్టుకోలేక ఇవి కొన్నిసార్లు ఆత్మహత్య కూడా చేసుకుంటాయ. అందుకే వీటిని పట్టుకోవడం, బంధించడం అస్సలు సాధ్యం కాదు.

కళ్లు తిప్పలేదు.. కానీ తలని 180 డిగ్రీలు తిప్పేస్తుంది

రెండో అతిచిన్న జీవి: కేవలం 100 నుండి 150 గ్రాముల బరువు మాత్రమే ఉండే ఈ జీవి, ప్రపంచంలోనే రెండవ అతిచిన్న కోతి జాతి జీవి.

భారీ కళ్లు: దీని శరీరం సైజుతో పోలిస్తే కళ్లు చాలా పెద్దవిగా ఉంటాయి. ఇవి పూర్తిగా రాత్రిపూట మాత్రమే తిరుగుతాయి. ఈ పెద్ద కళ్లు చీకట్లో వేటాడటానికి, శత్రువుల నుండి రక్షించుకోవడానికి హెల్ప్ అవుతాయి.

ఆంత లాంటి పవర్: విచిత్రం ఏంటంటే, ఈ టార్సియర్ తమ కనుగుడ్లను తిప్పలేవు. అందుకే ఇవి వేటాడేటప్పుడు సరిగ్గా గుడ్లగూబల లాగే తమ తలను రెండు వైపులా 180 డిగ్రీల వరకు పూర్తిగా తిప్పగలవు.

100శాతం ప్యూర్ నాన్-వెజ్ కోతి

ప్రపంచంలో ఉన్న అన్ని రకాల కోతి జాతులు పండ్లు, కాయగూరలు, చెట్ల ఆకులు తింటాయి. కానీ టార్సియర్లు మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఇవి 100శాతం మాంసాహారులు. పొరపాటున కూడా ఇవి ఎలాంటి వెజిటేరియన్ ఫుడ్‌ను ముట్టుకోవు. కేవలం చిన్న చిన్న కీటకాలు, జీవులను మాత్రమే వేటాడి తింటాయి.

ఇంట్లో పెంచుకుంటే ఖేల్ ఖతం..

వీటి నరాల సిస్టమ్ చాలా వీక్‌గా ఉండటం వల్ల వీటిని జూ ప్లాజాల్లో ఉంచడం లేదా ఇళ్లలో పెంచుకోవడం అసాధ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఫిలిప్పీన్స్ ప్రభుత్వం వీటి సంరక్షణ కోసం కఠినమైన నిబంధనలు అమలు చేస్తోంది. టార్సియర్ సంరక్షణ కేంద్రాలకు వచ్చే పర్యాటకులు నిశబ్దంగా ఉండాలని, కెమెరా ఫ్లాష్‌లు అస్సలు వాడకూడదని రూల్స్ పెట్టారు. అడవుల నరికివేత వల్ల ఈ వింత జీవుల సంఖ్య వేగంగా తగ్గిపోతుండటంతో వీటిని కాపాడుకోవడానికి అంతర్జాతీయ సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

Follow Us