Watch Video: ఓర్నీ, గొర్రెలకే పాఠాలా..! నెట్టింట నవ్వుల పువ్వులు పూయించిన వ్యక్తి.. వైరల్ అవుతున్న వీడియో..

|

Apr 28, 2023 | 2:00 PM

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో ఓ మాయాప్రపంచంగా మారిపోయింది. ప్రపంచలో ఏ మూల ఏ చిన్ని సన్నివేశం జరిగిన నిముషాల్లో నెట్టింట ప్రత్యక్షమవుతోంది. ఇక అనతి కాలంలోనే అవి ట్రెండింగ్ మారుతున్నాయి. అలా నెట్టింట తలుపు తట్టిన ఓ టీచర్‌..

Watch Video: ఓర్నీ, గొర్రెలకే పాఠాలా..! నెట్టింట నవ్వుల పువ్వులు పూయించిన వ్యక్తి.. వైరల్ అవుతున్న వీడియో..
Sheeps' Teacher
Follow us on

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో ఓ మాయాప్రపంచంగా మారిపోయింది. ప్రపంచలో ఏ మూల ఏ చిన్ని సన్నివేశం జరిగిన నిముషాల్లో నెట్టింట ప్రత్యక్షమవుతోంది. ఇక అనతి కాలంలోనే అవి ట్రెండింగ్ మారుతున్నాయి. అలా నెట్టింట తలుపు తట్టిన ఓ టీచర్‌ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ వీడియోలో సదరు టీచర్ ఎంతో ఉత్సాహంగా.. తన విద్యార్థులకు పుట్టుకతో వచ్చిన పాఠాలనే మళ్లీ బోధిస్తున్నాడు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లలో కొందరు ఆ టీచర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఆసలు ఆ టీచర్, తన విద్యార్థుల కథ ఏమిటంటే.. ఓ వ్యక్తి గొర్రెల వద్దకు వెళ్లి వాటిలా అరుస్తున్నాడు. అవి కూడా అతను అరిసిన వెంటనే టీచర్ చెప్పిన పాఠాలను పిల్లలు పలికినట్లుగా పలుకుతున్నాయి. ఇలా సాగిన వీడియో goatclubs అనే ఇన్‌స్టా ఖాతా నుంచి షేర్ అయి , ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘చాలా అద్భుతంగా ఉంది. పిల్లలు కూడా ఇంత బుద్ధిగా చెప్పలేరు’ అంటూ రాసుకొచ్చాడు. ‘ఇలాంటి టీచర్ క్లాస్‌లో ఉంటే చాలా సరదాగా ఉంటుంది’ అంటూ మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు. 

ఇవి కూడా చదవండి

కాగా, ఈ వీడియోకు ఇప్పటివరకు 15 వేల లైకులు, 3 లక్షల 38 వేల వీక్షణలు లభించాయి. ఇంకా ఈ వీడియోపై దాదాపు 120 మంది కామెంట్ చేశారు. మరోవైపు వీడియోను చూసిన పలువురు నెటిజన్లు తమ తమ సన్నిహితులకు దీన్ని షేర్ కూడా చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..