Viral Video: బీర్ కోసం నడి రోడ్డులో కారు ఆపేసి యువకుడి హల్ చల్

అలాగే మరికొందరు రద్దీగా ఉండే రోడ్లపై పరుగులు తీస్తూ అందరినీ పరేషన్ చేస్తుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. మందుబాబులు చేసే వింత చేష్టలకు లెక్కలే లేదని చెప్పాలి. ఒక్కో తాగుబోతు ఒక్కో విచిత్ర కళాకారుడే అని చెప్పాలి.. ఇకపోతే.. అలాంటి వీడియో సోషల్ మీడియాలో తాజాగా వెలుగులోకి వచ్చింది.. అదేంటో పూర్తి వివరాల్లోకి వెళితే...

Viral Video: బీర్ కోసం నడి రోడ్డులో కారు ఆపేసి యువకుడి హల్ చల్
Beer Side Effects

Updated on: Jun 03, 2025 | 12:46 PM

తాగుబోతులు చేసే వెర్రీ చేష్టాలతో వారి కుటుంబ సభ్యులే కాదు.. చుట్టుపక్కల వారు కూడా ఇబ్బంది పడేలా చేస్తుంటారు. ఫూటుగా మందు కొట్టి నడిరోడ్లపై కూడా తగ్గేదేలే అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. తాగిన మైకంలో కొందరు ఎత్తైన టవర్స్‌ ఎక్కేస్తుంటారు. మరికొందరు బురద, చెరువు అని కూడా చూడకుండా ఎక్కడ పడితే అక్కడే గుర్రుపెట్టి నిద్రపోతుంటారు. అలాగే మరికొందరు రద్దీగా ఉండే రోడ్లపై పరుగులు తీస్తూ అందరినీ పరేషన్ చేస్తుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. మందుబాబులు చేసే వింత చేష్టలకు లెక్కలే లేదని చెప్పాలి. ఒక్కో తాగుబోతు ఒక్కో విచిత్ర కళాకారుడే అని చెప్పాలి.. ఇకపోతే.. అలాంటి వీడియో సోషల్ మీడియాలో తాజాగా వెలుగులోకి వచ్చింది.. అదేంటో పూర్తి వివరాల్లోకి వెళితే…

వైరల్‌ వీడియోలో బీర్ కోసం నడి రోడ్డుపై కారు ఆపేసిన ఓ యువకుడి హల్ చల్ చేశాడు. కారుతో రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ యువకుడు.. ఒక చోట సిగ్నల్‌ పడగానే ఆగింది.. కానీ, ఆ పక్కనే అతనికి ఓ వైన్ షాప్ కనిపించింది. ఇక అంతే.. మనసు లాగేసినట్టుంది.. వెంటనే అతడు కారు రోడ్డుపైనే వదిలేసి..వైన్ షాపులోకి దూరాడు.. చల్లగా ఓ చిల్డ్‌ బీర్ కొట్టి సేదతీరాడు..ఇక రోడ్డుపై ఆగిపోయిన కారుతో చుట్టుపక్కల వాహనదారులకు ట్రాఫిక్‌ కష్టాలు తప్పలేదు..

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

అయితే.. సదరు యువకుడు చేసినదంతా సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కానీ, ఘటన జరిగింది ఎక్కడ అనేది మాత్రం తెలియలేదు.  కేవలం మందుకోసం కారు రోడ్డుపై నిలిపేసి ఇతరులను ఇబ్బంది పెట్టడం స్టుపిడ్ థింగ్ అంటూ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. మందు కోసం కారు తీసుకొని వెళ్లొచ్చుగా అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..