రెండు హృదయాల్లో ఒకరిపై ఒకరికి చెప్పలేనంతం ఇష్టం ఉన్న చెప్పడానికి పదాలు కరువవుతాయి. అనుకుంటాం గానీ.. మెప్పించి ఒప్పించడం అంత సులువేమీ కాదు. అందుకే ప్రేమను వ్యక్తం చేయడానికి నానాపాట్లు పడుతుంటారు కుర్రకారు. ఐతే ఓ ప్రేమికుడు తన ప్రేయసికి మనసులోని భావాన్ని వినూత్నంగా తెలిపి.. అందరి మన్ననలు పొందాడు. దీంతో ప్రేయసి ఇంప్రెస్ అయ్యిందో.. లేదో తెలియదు గానీ నెటిజన్లు మాత్రం ఫుల్ ఫిదా అయిపోయారు. వీరి లవ్ కహానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీరూ ఓ లుక్కేసుకోండి..
‘దీని గురించి చెప్పకుండా ఉండలేను.. తన ప్రేయసిగా ఉండటానికి నాకు కీబోర్డ్‌తో ప్రపోజ్ చేశాడు..’ అనే క్యాప్షన్‌తో రెండు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. మొదటి ఫొటోలో ఆమె బాయ్ ఫ్రెండ్ క్రియేటివ్‌గా తయారు చేసిన స్పెషల్ కీబోర్డు ఉంది. ‘బీ మై గర్ల్ ఫ్రెండ్ సెయాంగ్?’ అనే వాక్యం వచ్చేలా ఇంగ్లిష్ అక్షరాలను మాత్రమే కీ బోర్డులో కనిపించేలా కీస్ అరేంజ్ చేసిన కో బోర్డు అది. ఇక రెండో ఫొటోలో వాళ్ల సెల్ఫీని ఉంచి ట్విటర్లో పోస్టు చేశాడు.
i’ll never shut up about this, he proposed me to be his girlfriend with a keyboard. https://t.co/G8GDpsD62z pic.twitter.com/iPbCZ1zEdA
— 에이미 (@amymaymacc) April 29, 2023
కేవలం గంటల వ్యవధిలోనే 24 మిలియన్ల వ్యూస్, లక్షల్లో కామెంట్లు, లైకులు రావడంతో ఈ పోస్టు కాస్తా నెట్టింట వైరల్ అయ్యింది. ‘నీ హృదయాన్ని గెలుచుకోవడానికి అతను నిజంగానే కరెక్ట్ కీలను నొక్కినట్లు కనిపిస్తోందంటూ’ పలువురు నెటిజన్లు కామెంట్ సెక్షన్ లో ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇంతకీ మీరేమంటారు..?
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.