AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుర్ఖా ధరించి లేడీస్‌ బాత్‌రూమ్‌లోకి వెళ్లిన పురుషుడు! అతనితో పాటు ఓ మహిళ కూడా..

కరీంనగర్‌లోని ఓ మెడికల్ కాలేజీలో బుర్ఖా ధరించిన పురుషుడు, స్కార్ఫ్‌ ధరించిన మహిళ మహిళల టాయిలెట్‌లోకి ప్రవేశించడంతో గందరగోళం ఏర్పడింది. సిబ్బంది అనుమానంతో వారిని ఆపి పోలీసులకు అప్పగించారు. వారు దొంగతనం లేదా ఇతర అసాంఘిక కార్యక్రమాల కోసం వచ్చారా అనేది విచారణలో ఉంది.

బుర్ఖా ధరించి లేడీస్‌ బాత్‌రూమ్‌లోకి వెళ్లిన పురుషుడు! అతనితో పాటు ఓ మహిళ కూడా..
Burkha
SN Pasha
|

Updated on: Sep 05, 2025 | 5:52 PM

Share

నేరాలు చేయడానికో, దొంగతనాలు చేయడానికో కొంతమంది తమ వేషాలు మారుస్తుంటారు. కానీ, ఓ వ్యక్తి మహిళల బాత్‌రూమ్‌లోకి వెళ్లేందుకు బుర్ఖా ధరించాడు. ఈ వింత ఘటన కరీంనగర్‌ నగర శివార్లలో ఉన్న ఓ మెడికల్‌ కాలేజీలో చోటు చేసుకుంది. ఓ పురుషుడు ముస్లిం మహిళలు ధరించే బుర్ఖాను ధరించి ఆ మెడికల్‌ బాత్‌రూమ్‌లోకి వెళ్లాడు. అతని వెంట ఓ మహిళ కూడా వెళ్లింది.

అయితే ఆ మహిళ స్కార్ఫ్‌ కట్టుకొని ఉంది. వీరిద్దరి తీరు చూసి అనుమానం వచ్చిన మెడికల్‌ కాలేజ్‌ సిబ్బంది వీరిని ఆపి తనిఖీ చేశారు. బుర్ఖా తీసి చూడగా వాళ్లు షాక్‌ అయ్యారు. ఎందుకంటే అతనో పురుషుడు, అలాగే ఓ మహిళ స్కార్ఫ్‌ ధరించి అతనితో పాటు ఉంది. వీళ్లిద్దరూ ఇలా ముఖాలు కనబడకుండా బాత్‌రూమ్‌లోకి ఎందుకు వెళ్లారు అనేది ఇప్పుడు పెద్ద చిక్కుముడిగా మారింది.

వీళ్లు దొంగతనానికి వచ్చారా? లేదా ఏదైనా అసాంఘీక కార్యక్రమంలో లేడీస్‌ బాత్‌రూమ్‌లోకి దూరారా? అనేది తెలియాల్సి ఉంది. ఇలా బుర్ఖా ధరించి మహిళల బాత్‌రూమ్‌లోకి ప్రవేశించిన ఆ వ్యక్తిని, అలాగే అతనితో పాటు ఉన్న మహిళను మెడికల్‌ కాలేజీ సిబ్బంది పోలీసులకు అప్పగించారు. ఇక పోలీసులు వారి స్టైల్‌లో విచారిస్తే తప్ప వాళ్లిద్దరూ లేడీస్‌ బాత్‌రూమ్‌లోకి ఎందుకు వెళ్లారనేది తేలుతుంది.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా